Home Film News Ram Charan Watch: మీడియాతో మాట్లాడిన స‌మ‌యంలో రామ్ చ‌ర‌ణ్ ధ‌రించిన వాచ్ ఖ‌రీదు అన్ని ల‌క్ష‌లా?
Film News

Ram Charan Watch: మీడియాతో మాట్లాడిన స‌మ‌యంలో రామ్ చ‌ర‌ణ్ ధ‌రించిన వాచ్ ఖ‌రీదు అన్ని ల‌క్ష‌లా?

Ram Charan Watch: ప్ర‌స్తుతం మెగా ఇంట సందడి నెల‌కొంది. రానున్న రోజుల‌లో మెగా ఫ్యామిలీలో వ‌రుస వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కొద్ది రోజుల క్రితం వరుణ్ తేజ్ నిశ్చితార్థం జ‌ర‌గ‌గా, త్వ‌ర‌లో పెళ్లి కూడా జ‌ర‌గ‌నుంది. ఇక జూన్ 20న ఉపాస‌న పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డంతో మెగా అభిమానుల ఆనందం రెట్టింపు అయింది. ఈ క్ష‌ణం కోసం అభిమానులు కొన్ని ఏళ్ల నుండి ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌చ్చారు. ఈ క్రమంలో జూన్ 20 తెల్ల‌వారుఝామున 1.49 ని.ల‌కు పాపాయికి జ‌న్మ‌నిచ్చింది. ఇక జూన్ 23న ఉపాస‌న డిశ్చార్జ్ కాగా, ఆ స‌మ‌యంలో రామ్ చ‌ర‌ణ్ మీడియాతో మాట్లాడుతూ.. తన ఆనందాన్ని పంచుకున్నారు. మీ అంద‌రి ప్రేమ‌, ఆశీస్సులు మాతో పాటు మా పాప‌కి కూడా ఉండాల‌ని చ‌ర‌ణ్ అన్నారు.
ఇక పాప పేరు గురించి అడ‌గ‌గా,  ఓ పేరు అనుకున్నాం. ఆ పేరు ఏంట‌నేది.. పేరు పెట్టే రోజు కోసం వెయిట్ చేయండి. ఆ రోజు  అందరికీ నేనే స్వయంగా చెబుతాను. అనుకున్న టైమ్ లో సంతానాన్ని అందించినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలియ‌జేస్తున్నాను. పాప కచ్చితంగా నాలానే ఉంటుంది. ఇక నా పాపను దీవించిన మీడియాకు, శ్రేయోభిలాషులకు థ్యాంక్స్ చెప్పాడు రామ్ చ‌ర‌ణ్‌. ఇక మొదటిసారి పాపను చేతుల్లోకి తీసుకున్నప్పుడు, ప్రతి తండ్రి ఎలా ఫీలయ్యాడో తను కూడా అలానే ఫీలయ్యానని పేర్కొన్నాడు చరణ్. ఆ అనుభూతిని మాటల్లో చెప్ప‌లేనిది అని స్ప‌ష్టం చేశాడు.
అయితే మీడియాతో మాట్లాడిన స‌మ‌యంలో రామ్ చ‌ర‌ణ్ గాగుల్స్ ధరించి వైట్ ష‌ర్ట్, బ్లూ జీన్స్ ధ‌రించి ఉన్నాడు. అలానే చేతికి వాచీ పెట్టుకోగా, అంద‌రి దృష్టి ఆ వాచ‌పై ప‌డింది. ఆ వాచ్ రిచర్డ్ మిల్లే బ్రాండ్ కు చెందిన వాచ్ కాగా, ఇప్పుడు ఆ వాచ్ ధర ఎంతనే దానిపై కొందరు అభిమానులు సెర్చ్ చేశారు. దీని ధ‌ర అక్షరాల రూ.కోటీ 62 లక్షలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్,, నెటిజన్లు షాక్ లో ఉన్నారు. వాచ్‌కి పెట్టిన ఖ‌ర్చుతో లగ్జరీ ఇల్లు కొనొచ్చు సామీ అంటూ.. ఆ వాచ్ అమ్మితే మా బ్యాచ్ సెటిల్ అయిపోద్ది అంటూ కొంద‌రు  కామెంట్లు పెడుతున్నారు. ఇక చ‌ర‌ణ్ మ‌రి కొద్ది రోజుల పాటు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ఇంట్లోనే ఉండ‌నున్నాడు. పాపతో, భార్యతో  ఆ ఆనంద క్ష‌ణాలు గడిపిన తర్వాత, తిరిగి గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ లో పాల్గొన‌నున్నాడు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...