Home Film News Tollywood Flash Strike : ‘మన బ్యాంకులు నిండకపోయినా, కంచాలు నిండుతున్నాయి’ – సినీ కార్మికులకు వీకే నరేష్ విజ్ఞప్తి
Film News

Tollywood Flash Strike : ‘మన బ్యాంకులు నిండకపోయినా, కంచాలు నిండుతున్నాయి’ – సినీ కార్మికులకు వీకే నరేష్ విజ్ఞప్తి

VK Naresh
VK Naresh

Tollywood Flash Strike: కరోనా దెబ్బకి అన్నిరంగాలతో పాటు తెలుగు సినిమా పరిశ్రమ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కోట్లాది రూపాయల భారీ నష్టాలను చవిచూసింది. గతకొద్ది రోజులుగా పరిస్థితులు అదుపులోకి రావడంతో యదావిధిగా షూటింగ్స్ జరుగుతున్నాయి. ఇలాంటి పరిణామంలో వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కొందరు సినీ కార్మికులు ‘ఫ్లాష్ స్ట్రైక్’ చేపట్టడంతో షూటింగులు నిలిచిపోయాయి.

తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటున్న తరుణంలో ఇలాంటి స్ట్రైకులు చెయ్యడం మంచి పద్ధతి కాదని.. కూర్చుని చర్చించుకుంటే సమస్యలను పరిష్కరించుకోవచ్చునని.. సీనియర్ నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షుడు వీకే నరేష్ సినీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ వీడియో విడుదల చేశారు.

నరేష్ మాట్లాడుతూ.. ‘‘యూనియన్స్ తమ వేతనాలు పెంచాలని కోరడం మంచిదే. పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి దీని మీద. కోవిడ్ వల్ల దాదాపు మూడేళ్ల పాటు సినీ పరిశ్రమ చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు సినీ పరిశ్రమ వెంటిలేటర్ మీద ఊపిరి పీల్చుకుంటోంది. మన బ్యాంకులు నిండకపోయినా.. కంచాలు నిండుతున్నాయి.. ఇలాంటి టైంలో ‘ఫ్లాష్ స్ట్రైక్’ అనేది బాధాకరం.. కరోనా టైంలో నిర్మాతలు కోట్ల రూపాయలు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడ్డారు. ఇటువంటప్పుడు తొందరపాటుగా కాకుండా కాస్త టైం తీసుకుని అందరం కలిసి నిర్ణయం తీసుకుంటే మంచిది’’ అన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...