Home Film News Mahesh Babu : హ్యాపీ బర్త్‌డే సూపర్ స్టార్ మహేష్
Film News

Mahesh Babu : హ్యాపీ బర్త్‌డే సూపర్ స్టార్ మహేష్

HBD MAHESH
HBD MAHESH

Mahesh Babu: ఆగస్టు 9.. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు.. ఘట్టమనేని అభిమానులకు పండుగరోజు.. 2022 ఆగస్టు 9న మహేష్ బాబు 47వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ గారి నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్‌కి.. చైల్డ్ హుడ్‌లోనే స్టార్ డమ్ వచ్చింది.

ఇప్పటి జనరేషన్ స్టార్స్.. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చెయ్యడం ఎలా అనేది మహేష్‌ని చూసే నేర్చుకోవాలి. సినిమాలు, యాడ్స్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. షూటింగ్స్ నుండి గ్యాప్ దొరికిందంటే ఒకే.. లేదంటే బ్రేక్ తీసుకుని మరీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు. సంవత్సరానికి మినిమమ్ టూ టైమ్స్ వైఫ్ నమ్రత, కిడ్స్‌ గౌతమ్, సితారలతో విదేశాలకు ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. బర్త్‌డే సందర్భంగా విషెస్ చెబుతూ.. మహేష్ గురించిన వివరాలు ఓసారి చూద్దాం..

ఫస్ట్ 1979లో నాలుగేళ్ల వయసులో.. దర్శకరత్న దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘నీడ’ సినిమాతో కెమెరా ముందుకొచ్చారు మహేష్. తర్వాత బాలనటుడిగా తండ్రి, అన్నయ్యలతో కలిసి పలు సూపర్ హిట్ మూవీస్ చేశారు. తర్వాత 1983లో కృష్ణ గారితో కలిసి మొట్టమొదటిసారి ‘పోరాటం’ అనే సినిమాలో నటించారు. ఇందులో కృష్ణ, మహేష్ అన్నదమ్ముళ్లుగా కనిపించారు. మళ్లీ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత తండ్రితో ‘శంఖారావం’ లో నటించారు. ఫస్ట్ టైం రీల్ లైఫ్‌లో తండ్రీకొడుకులుగా నటించారు. ‘బజారు రౌడీ’ లో ఫస్ట్ టైం అన్నయ్య రమేష్ బాబుతో యాక్ట్ చేశారు.

‘ముగ్గురు కొడుకులు’ లో కృష్ణ, రమేష్ బాబు, మహేష్ బాబు అన్నదమ్ముళ్లుగా నటించారు. తర్వాత తండ్రితో ‘గూఢాచారి 117’ చేశారు. ఈ మూవీలో నటనతో పాటు డ్యాన్స్‌తోనూ ఆకట్టుకున్నారు మహేష్. 1989లో ‘కొడుకు దిద్దిన కాపురం’ లో ఫస్ట్ టైం డ్యుయెల్ రోల్ చేసి సినిమాకి హైలెట్‌గా నిలిచారు. ఛైల్డ్ ఆర్టిస్టుగా ఉన్నప్పుడు డూప్ లేకుండా రిస్కీ యాక్షన్ సీన్స్‌లో నటించి.. తండ్రికితగ్గ తనయుడు అనిపించుకున్నారు.

1990లో తొలిసారి ‘బాలచంద్రుడు’ లో ఫుల్ లెంగ్త్ రోల్‌లో మహేష్ బాబుని చూసి కృష్ణ గారి ఫ్యాన్స్, ఆడియన్స్.. హీరోగా ఎంట్రీయే లేటు అనుకున్నారు.. తర్వాత నాన్నతో ‘అన్న- తమ్ముడు’ చేశారు. మహేష్ బాలనటుడిగా చేసిన చివరి సినిమా ఇది. ఈ రెండు సినిమాల్లోనూ ‘ఒమెగా స్టార్’ గా తన టైటిల్ పడుతుంది.

కొంత గ్యాప్ తర్వాత 1999లో ‘రాజకుమారుడు’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. అక్కడినుండి రీసెంట్‌గా వచ్చిన ‘సర్కారు వారి పాట’ వరకు మహేష్ ఫిలిం జర్నీ.. అవార్డ్స్, యాడ్స్ లాంటి వాటికి సంబంధించిన విషయాలు తెలిసినవే. సోషల్ సర్వీస్‌తో రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకున్నారు.

‘శ్రీమంతుడు’ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. రతన్ టాటాతో సహా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. వెయ్యిమందికి పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించారు. అలాగే తన రెమ్యునరేషన్‌లో కొంతభాగాన్ని పలు సేవా కార్యక్రమాలకి విరాళంగా ఇస్తుంటారు.

ఈ ఏడాది మహేష్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్ కొద్ది రోజులు ముందుగానే సంబరాలు షురూ చేసేశారు. ‘ఒక్కడు’ తర్వాత మహేష్ కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన మూవీ ‘పోకిరి’.. ఈ సినిమాని 4Kలో రిలీజ్ చెయ్యబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ స్పెషల్ షో స్ ప్లాన్ చెయ్యగా.. రికార్డ్ స్థాయిలో టికెట్స్ బుక్ అయిపోయాయి..

రీసెంట్‌గా ఫ్యామిలీతో స్విట్జర్లాండ్ టూర్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ వచ్చారు సూపర్ స్టార్.. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత త్రివిక్రమ్‌తో చేయబోయే మూడవ సినిమా షూటింగ్ కొద్దిరోజుల్లో స్టార్ట్ కానుంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మహేష్ నటిస్తున్న 28వ సినిమా ఇది. దీని తర్వాత.. తెలుగు సినిమా స్టామినాని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకధీరుడు రాజమౌళితో ఓ సినిమా చెయ్యబోతున్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా ఈ ఫిలిం రానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...