Home Film News Samantha: ఏంటి స‌మంత మూడు పెళ్లిళ్లు చేసుకుంటుందా.. నాగ చైతన్య ఎన్నంటే..!
Film News

Samantha: ఏంటి స‌మంత మూడు పెళ్లిళ్లు చేసుకుంటుందా.. నాగ చైతన్య ఎన్నంటే..!

Samantha: టాలీవుడ్ మోస్ట్ క్రేజీ క‌పుల్ అయిన స‌మంత‌- నాగ చైత‌న్య ఊహించ‌ని విధంగా విడాకులు తీసుకొని త‌మ అభిమానుల‌కి పెద్ద షాక్ ఇచ్చారు. వీరిద్దరు కలిసి నటించిన తొలి సినిమాతోనే మంచి స్నేహితులుగా మార‌గా, కొంత కాలం తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అయితే నాలుగేళ్ల పాటు అన్యోన్యంగా ఉన్న వీరు కొన్ని వ్యక్తిగత కారణాలతో అక్టోబర్ 2, 2021న విడాకుల విష‌యం ప్రకటించారు. ఈ వార్త అప్పట్లో ఎంత‌ సంచలనం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక వీరి విడాకులకు అసలు కారణం ఏంటనేది ఇప్పటి వరకు అయితే తెలియ‌దు.

స‌మంత‌- నాగ చైత‌న్య విడిపోతున్న‌ట్టు వేణు స్వామి ముందుగానే చెప్పిన విష‌యం తెలిసిందే. ఆయ‌న చెప్పిన కొద్ది రోజుల‌కి వీరిద్ద‌రు త‌మ విడాకుల గురించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు. స‌మంత‌- నాగ చైత‌న్య విడాకుల‌తోనే ఫుల్ ఫేమ‌స్ అయ్యారు వేణు స్వామి. అయితే తాజాగా ఆయ‌న వారిద్ద‌రు విడిపోవ‌డానికి గ‌ల కార‌ణం చెప్పారు. విడాకుల ప్ర‌క‌ట‌న చేసిన‌ప్ప‌టి నుండి వారి విడాకుల‌కి సంబంధించిన అనేక ప్ర‌చారాలు జ‌రుగుతుండ‌గా, నాగ చైతన్య- సమంత పెళ్లి బంధం నిలవకపోవడానికి అసలు కారణం గ్రహాలు అనుకూలించక పోవడమే అని వేణు స్వామి అన్నారు. ఈ ఇద్ద‌రి జాతకంలో శని ఉచ్ఛ స్థితిలో ఉందని, అందుకే వీళ్లు కలిసి ఉండలేరు అని ముందే చెప్పానని చెప్పుకొచ్చారు. ఇక ఈ జాతకస్తులకు రెండు, మూడు పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంటుందని కూడా ఆయ‌న చెప్పారు.

 

కస్ట‌డీ మూవీ ప్ర‌మోష‌న‌ల్‌లో నాగ చైత‌న్య తన విడాకుల గురించి తొలిసారి స్పందించారు.మేము ఇద్దరం చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నామని , కాక‌పోతే సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల వల్లే మా మధ్య ఇబ్బందికరంగా పరిస్థితులు మారాయని నాగచైతన్య స్ప‌ష్టం చేశారు. . ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్లుగా ప్ర‌చారం చేసార‌ని అది చాలా బాధించింద‌ని కూడా చైతు అన్నారు. జీవితంలో ప్ర‌తి ద‌శను తాను ఎంతో గౌర‌విస్తానంటూ కూడా చైత‌న్య చెప్పుకొచ్చాడు. కొద్ది రోజులుగా చైత‌న్య‌.. వేరే హీరోయిన్స్ తో ప్రేమ‌లో ఉన్నాడని ,త్వర‌లో పెళ్లి చేసుకోనున్నాడంటూ ప్ర‌చారం న‌డుస్తుంది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...