Home Film News Gaddar: నేడు ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో గద్ధ‌ర్ అంత్య‌క్రియ‌లు.. ఆయ‌న మృతికి అస‌లు కార‌ణ‌మిదే..!
Film News

Gaddar: నేడు ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో గద్ధ‌ర్ అంత్య‌క్రియ‌లు.. ఆయ‌న మృతికి అస‌లు కార‌ణ‌మిదే..!

Gaddar: త‌న గొంతుకతో ఎంతోమందిని చైత‌న్యవంతుల‌ని చేసి పెత్తందారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించిన ప్ర‌జా యుద్ధ నౌక్ గ‌ద్ధ‌ర్ అలియాస్ గుమ్మ‌డి విఠ‌ల్. పొడుస్తున్న పొద్దుమీద న‌డుస్తున్న కాల‌మా అనే పాట‌ల‌తో ప్ర‌కంప‌న‌లు పుట్టించారు. చివ‌రిగా కాంగ్రెస్ నాయ‌కులు ఖ‌మ్మ‌లో ఏర్పాటు చేసిన ఖ‌మ్మం స‌భ‌లో క‌నిపించిన గ‌ద్ధ‌ర్ ఆదివారం మ‌ధ్యాహ్నం అమీర్‌పేట్‌లోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయ‌న 1949 జూన్ 5న తెలంగాణ రాష్ట్రంలోని తూప్రాన్‌లో జన్మించ‌గా, నిజామాబాద్‌లో విద్యాబ్యాసం కొన‌సాగించారు. ఇక 1975లో కెనరా బ్యాంకులో ఉద్యోగం చేశారు. అయితే గ‌ద్ద‌ర్ మృతి ప్ర‌తి ఒక్క‌రిని శోక సంద్రంలోకి నెట్టింది. అభిమానులు, కవులు, కళాకారులు, రాజకీయ, సినీ ప్రముఖులు ఆయ‌న‌కు ఘ‌న నివాళులు అర్పిస్తున్నారు.

గ‌ద్ధ‌ర్ జులై 20న తీవ్రమైన ఛాతినొప్పితో అపోలో ఆసుపత్రిలో చేరగా.. ఆగస్టు 3న బైపాస్‌ సర్జరీ చేయించుకున్నారు. ఆపరేషన్‌ సక్సెస్‌ అయినట్లు వైద్యులు కూడా ప్రకటించిన‌, ఆయ‌న ఇలా స‌డెన్ గా మృతి చెందడం ప‌లువురిలో అనుమానులు రేకెత్తిస్తుంది. అయితే గద్దర్‌ మృతికి గల కారణాలను తాజాగా వెల్లడించారు అపోలో వైద్యులు. గ‌ద్ధ‌ర్.. ఊపిరితిత్తులు, యూరినరీ సమస్యలతో కొన్నాళ్లుగా బాధపడుతున్నారు. వాటి నుంచి పూర్తిగా కోలుకోలేకపోవడంతో గద్దర్ ఆరోగ్యం మరింత క్షీణించి క‌న్నుమూసిన‌ట్టు వైద్యులు చెప్పుకొచ్చారు. కాగా గద్దర్‌కు భార్య, సూర్యుడు, చంద్రుడు, వెన్నెల అనే ముగ్గురు సంతానం ఉన్నారు.

 

గ‌ద్ధ‌ర్ మృత‌దేహాన్ని ఆదివారం సాయంత్రం నుంచి.. ఎల్బీ స్టేడియంలో ఉంచ‌గా, ఆయ‌న‌కి క‌డ‌సారి నివాళులు అర్పించేందుకు బంధువులు, అభిమానులు, ఉద్యమకారులు..భారీగా త‌ర‌లి వ‌స్తున్నారు. చివ‌రిగా ఆయనతో తమకి ఉన్న‌ అనుబంధాన్ని పంచుకుంటున్నారు. సోమవారం ఉదయం 11 గంటలవరకూ గ‌ద్ధ‌ర్ పార్థీవదేహాన్ని అక్కడే ఉంచి.. ఆ తర్వాత.. అల్వాల్‌లోని గద్దర్ ఇంటికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి అంతిమయాత్ర కొనసాగ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఆల్వాల్‌లో గద్దర్ స్థాపించిన మహోబోధి విద్యాలయంలోనే ఆయ‌న అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి. స్కూల్ ఆవరణలోనే అంత్యక్రియలు నిర్వహించాలనేది గద్దర్ చివరి కోరికని , అందుకే అక్కేడే ఏర్పాట్లు చేయ‌మ‌ని ఆయన సతీమణి విమల సూచించిడంతో కుటుంబీకులు, కళాకారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర‌భుత్వం లాంఛ‌నాల‌తో గ‌ర్ధ‌ర్ అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...