Home Film News Allu Aravind: చిరంజీవి గురించి త‌ప్పుగా మాట్లాడిన వారిని జైలుకి పంపించేంత వ‌ర‌కు వ‌ద‌ల్లేదు..అర‌వింద్ షాకింగ్ కామెంట్స్
Film News

Allu Aravind: చిరంజీవి గురించి త‌ప్పుగా మాట్లాడిన వారిని జైలుకి పంపించేంత వ‌ర‌కు వ‌ద‌ల్లేదు..అర‌వింద్ షాకింగ్ కామెంట్స్

Allu Aravind: 2011లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై చేసిన రాజ‌శేఖ‌ర్ -జీవిత‌లు త‌ప్పుడు ఆరోప‌ణలు చేయ‌గా, ఇటీవ‌ల కోర్టు వారిద్ద‌రికి రెండేళ్ల జైలు శిక్ష మరియు రూ. 5,000 జరిమానా విధించిన విష‌యం తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అరవింద్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి క్రిమినల్ కోర్టులోని 17వ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ ప్ర‌క‌ట‌న చేసింది. అయితే ఆర్డర్‌పై అప్పీల్ చేయడానికి సమయం ఇవ్వడానికి అదే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా, చిరంజీవి త‌న బ్లడ్ బ్యాంక్‌లో దాతల నుంచి ఉచితంగా సేకరించిన రక్తాన్ని యూనిట్ రూ.850 చొప్పున విక్రయించారని వారు త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశారు.

బ్లడ్ బ్యాంక్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.14.5 లక్షలను పొందిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ర్ ఎన్నో అవ‌క‌త‌వ‌క‌లు చేసింద‌ని వారు ఆరోపించ‌డంతో… చిరంజీవికి బావమరిది అయిన అల్లు అర‌వింద్ వారిపై ఆధారాల‌తో ప‌రువు న‌ష్టం వేసారు. ఇప్పుడు ఇదే విష‌యంపై ఆయ‌న భోళా శంక‌ర్ ప్రీ రిలీజ్ వేడుక‌లో మాట్లాడారు. ఆగ‌స్ట్ 10న విడుద‌ల కానున్న భోళా శంకర్ మూవీ గ‌త రాత్రి శిల్ప‌క‌ళా వేదిక‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వ‌హించుకుంది. ఈ కార్య‌క్ర‌మానికి మెహర్ రమేశ్, కీర్తి సురేష్, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, యంగ్ డైరెక్టర్స్ బాబీ, సంపత్ నంది, గోపీచంద్ మాలినేని, బుచ్చిబాబు, వంశీ పైడిపల్లి, హైపర్ ఆది, శ్రీముఖి త‌దిత‌రులు హాజరయ్యారు.

 

ఈవెంట్‌లో ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భోళా శంక‌ర్ మంచి విజ‌యం సాధిస్తుంది. అయితే చిరంజీవి చూడ‌ని స‌క్సెస్ ఏది. ఆయ‌న సినిమాలు చూస్తూ మీరంతా పెరిగితే, ఆయ‌న‌తో సినిమాలు చేస్తూ పెరిగాను. చిరంజీవిపై నాకున్న అభిమానం ఎలాంటిందంటే ..చిరంజీవి గారు చేసే సేవల్ని కొందరు త‌ప్పుగా మాట్లాడరని తెలిసి.. 12 ఏళ్లు పోరాడి మరీ వారిని జైలుకి పంపించేంత వరకు వదలలేదని అన్నారు. ఆయ‌న‌పై నాకు అంతటి అభిమానం ఉందని గుర్తుచేశారు. భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజశేఖ‌ర్-జీవిత‌ల ఇష్యూల‌పై అల్లు అర‌వింద్ ఇలా ఓపెన్‌గా మాట్లాడ‌డం ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...