Home Film News Hyper Adi: ఆది స్పీచ్‌తో కంట క‌న్నీరు పెట్టుకున్న చిరంజీవి.. మెగా ఫ్యాన్స్‌కి అయితే గూస్‌బంప్స్ వ‌చ్చేశాయి..!
Film News

Hyper Adi: ఆది స్పీచ్‌తో కంట క‌న్నీరు పెట్టుకున్న చిరంజీవి.. మెగా ఫ్యాన్స్‌కి అయితే గూస్‌బంప్స్ వ‌చ్చేశాయి..!

Hyper Adi: గ‌త రాత్రి శిల్ప‌క‌ళావేదిక‌లో జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హైప‌ర్ ఆది మెగా అభిమానుల‌కి గూస్ బంప్స్ వ‌చ్చేలా మాట్లాడారు. సినిమాలు, రాజ‌కీయాలు, విమ‌ర్శ‌ల గురించి త‌న‌దైన శైలిలో మాట్లాడారు. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి హైప‌ర్ ఆది మాట్లాడుతున్న స‌మ‌యంలో చిరు చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు. ఆయ‌న క‌ళ్లు చెమ‌ర్చాయి.తమ్ముడి గురించి మాట్లాడుతున్నంత సేపు చిరు కంట్లో తడి కనిపించింది. ఆది మాట్లాడుతూ.. చిరంజీవి ముప్పై ఏళ్లుగా చిత్ర ప‌రిశ్ర‌మ‌ని ఏలుతున్నాడు. ఎంతో మంది సినీ సైనికులను తయారు చేసి ఇంద్ర సేనాని అయితే.. అక్కడ తమ్ముడేమో జన సైనికుల్ని తయారు చేసి జన సేనాని అయ్యాడు అని ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.

ఠాగూర్ సినిమాలో చిరంజీవికి నచ్చని పదం క్షమించడం.. కానీ ఆయ‌న త‌న‌ నిజ జీవితంలో అందరినీ క్షమిస్తూనే ఉంటాడు.. కొంత మంది యూట్యూబ్ చానెళ్లు హీరో సుమన్, ఉదయ్ కిరణ్ విషయాల మీద తప్పుడు వార్తలు రాసిన వారిని కూడా చిరంజీవి క్ష‌మించారు. ఓ పెగ్ వేస్తే మెగాస్టార్ గురించి.. ఇంకో పెగ్ వేస్తే పవన్ కళ్యాణ్ గురించి కొంద‌రు మాట్లాడతారు.. చిరంజీవి గారి వారసుడు రామ్ చరణ్ పై కూడా అనేక విమ‌ర్శ‌లు చేశారు. ఆయ‌న రంగ‌స్థ‌లంతో అంద‌రి నోళ్లూ మూయించారు. సచిన్ కొడుకు సచిన్ కాలేదు.. అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ కాలేదు.. కానీ చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు. గ్లోబల్ స్టార్ అని పెట్టుకుంటే రాదు.. అందరినీ నెట్టుకుంటూ దాటుకుంటూ నిలబడితే వస్తుంది..

 

ఇటీవ‌ల ఒక సారి రాజకీయాల గురించి చిరంజీవి గారి అడిగాను.. రాజకీయ వార్తలు చూడటం మానేశాను అని అన్నారు.. నా తమ్ముడిని ఎవడు పడితే వాడు తిడుతున్నాడు.. అందుకే వార్తలు చూడటం లేదు.. అని చెప్పుకొచ్చారు. ఆయన్ను అవమానించిన వాడ్ని ఆయన వదిలేస్తాడేమో గానీ.. తమ్ముడు మాత్రం అందరికీ తిరిగి ఇస్తాడు.. అన్నయ్య మంచోడు కాబట్టే అంద‌రు ముంచేశారు.. కానీ తమ్ముడు మొండోడు.. తాడో పేడో తేల్చుకుంటాడు.. డబ్బుల మీద వ్యామోహం లేని వాళ్లు.. ఇలాంటి వాళ్ల గురించి ఎవరైనా తప్పుడు వార్తలు రాస్తే.. కుర్చీ మడతపెట్టి…. ఇలాంటివి కింది స్థాయి వాళ్లకి అర్థం కాదు.. మినిమం డిగ్రీ చదివి ఉండాలి అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు ఆది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...