Home Film News Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- అన్నా విడాకుల‌పై వ‌చ్చిన క్లారిటీ..ఒక్క ఫోటోతో అన్నింటికి స‌మాధానం
Film News

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- అన్నా విడాకుల‌పై వ‌చ్చిన క్లారిటీ..ఒక్క ఫోటోతో అన్నింటికి స‌మాధానం

Pawan Kalyan: మెగా ఫ్యామిలీలో ఇటీవ‌ల సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొన్న తెలిసిందే.జూన్ 9న వ‌రుణ్ తేజ్ త‌ను ప్రేమించిన లావ‌ణ్య త్రిపాఠితో నిశ్చితార్థం జ‌రుపుకోగా,  ఈ కార్య‌క్రమానికి మెగా, అల్లు కుటుంబ స‌భ్యులు అంద‌రు హాజ‌ర‌య్యారు. దీంతో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది.  ఇక జూన్ 20న ఉపాస‌న పండంటి ఆడబిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. మ‌హ‌ర్జాత‌కురాలు పుట్టింద‌ని ప్ర‌తి ఒక్క‌రు సంబ‌ర ప‌డ్డారు. జూన్ 30న బార‌సాల జ‌రిపి ఆ చిన్నారికి క్లింకార అనే పేరు ఫిక్స్ చేశారు. పేరు బాగుందంటూ అభిమానులు కామెంట్ల వ‌ర్షం కురిపించారు. ఒకే నెల‌లో రెండు శుభ‌వార్త‌లు వినేసరికి ఫ్యాన్స్ ఆనందం  అంతా ఇంతాకాదు.

ఇక గ‌త కొన్నాళ్లుగా నిహారిక‌-చైత‌న్య‌ల విడాకుల గురించి అనేక ప్ర‌చారాలు జ‌రుగుతుండ‌గా, జూలై 5న నిహారిక తాము విడాకులు తీసుకున్న‌ట్టు తెలియ‌జేసింది. ఇక ఇదే స‌మయంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా త‌న మూడో వైఫ్‌తో డైవ‌ర్స్ తీసుకున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం న‌డిచింది. అన్నా త‌న పిల్ల‌ల‌తో ర‌ష్యాకి వెళ్లిపోయిందని, ఇక రాద‌ని ఏవేవో పుకార్లు పుట్టించారు. వీటన్నింటికి ఒకే ఒక్క ఫొటోతో క్లారిటీ వ‌చ్చింది. జ‌న‌సేన అధికారిక పార్టీ ఆ వార్త‌లు అన్ని అవాస్త‌వాల‌ని ఇన్‌డైరెక్ట్‌గా తెలియ‌జేసింది.

జ‌న‌సేన పార్టీ ట్విట్ట‌ర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అన్నా లెజినోవా క‌లిసి ఉన్న పిక్ షేర్ చేస్తూ..  “జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో మంగళగిరి చేరుకుంటారు” అంటూ ట్వీట్ చేసింది. దీంతో విడాకులు రూమర్స్ అని పూర్తిగా అవాస్త‌వాలు అని తేలిపోయాయి. ఫ్యాన్స్ కాస్త
ఊపిరి పీల్చుకున్నారు.

Related Articles

Betper bahis sitesi guncel giris 2023

Betper bahis sitesi guncel giris 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...