Home Film News Salaar Teaser: కోడి కొక్కొరోకో అన‌క ముందే విడుద‌లైన స‌లార్ టీజ‌ర్..అంచ‌నాల‌ని మించి..
Film News

Salaar Teaser: కోడి కొక్కొరోకో అన‌క ముందే విడుద‌లైన స‌లార్ టీజ‌ర్..అంచ‌నాల‌ని మించి..

Salaar Teaser: బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ ఆ త‌ర్వాత మూడు భారీ పాన్ ఇండియా చిత్రాలు చేశాడు. ఈ మూడు కూడా అభిమానుల‌ని తీవ్ర నిరాశ‌ప‌ర‌చాయి. ఇందులో ఒక్క చిత్రం కూడా క‌నీసం యావరేజ్ టాక్ అందుకోలేక‌పోయింది. ఇంత భారీ క‌టౌట్‌తో అలాంటి సినిమాలు తీసినందుకు ప్ర‌భాస్ అభిమానులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే ప‌ర్‌ఫెక్ట్ కటౌట్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం కొంద‌రు ద‌ర్శ‌కుల వ‌ల్ల‌నే అవుతుంది. వారిలో కేజీఎఫ్ ఫేం ప్ర‌శాంత్ నీల్ ఒకరు. య‌శ్‌తో అద్భుతాలు చేసిన ఈ డైరెక్ట‌ర్ ఇప్పుడు ప్ర‌భాస్‌తో స‌లార్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా గ‌త కొద్ది రోజులుగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుడ‌గా, సెప్టెంబర్ 28న రిలీజ్‌కి ప్లాన్ చేశారు.

ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి ప‌లు స్టిల్స్ విడుద‌ల చేసి మూవీపై భారీ అంచనాలు పెంచిన ప్ర‌శాంత్ నీల్..ఈ ఉద‌యం 5.12ని.ల‌కు స‌లార్ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇస్తుంది.  హీరోకి ప్రశాంత్ నీల్ ఒక రేంజ్ ఎలివేషన్ ఇస్తూ.. ప్ర‌భాస్‌ని ఓ రేంజ్‌లో చూపించాడు.. ఫ్యాక్ట‌రీలో ఓ వ్య‌క్తిని వంద‌ల మంది చుట్టుముడితే అప్పుడు ఆ వ్య‌క్తి..”లయన్, చీతా, టైగర్, ఎలిఫాంట్ వెరీ డేంజరస్. అయితే… జురాసిక్ పార్క్ లో కాదు. ఎందుకంటే… ఆ పార్క్ లో” అంటూ చెబుతుండ‌గా, రెబల్ స్టార్ ప్రభాస్ ను చూపించారు.ఇక  టీజర్ ఎండింగులో పృథ్వీరాజ్ సుకుమారన్ ని కూడా చూపించారు. ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ యాక్షన్ టీజర్ మొత్తం కనిపించింది.

ఇక స‌లార్‌ని రెండు పార్ట్‌లుగా రూపొందిస్తున్న‌ట్టు టీజ‌ర్‌ని బ‌ట్టి అర్ధ‌మైంది. `కేజీఎఫ్‌ 2`  చిత్రం మార్నింగ్‌ 5.12కి మగియ‌గా, సినిమాలో టైమింగ్‌ ప్రకారం. `సలార్‌` టీజర్‌ని అదే సమయంలో రిలీజ్‌ చేయడంతో ఇప్పుడు దానికి కొస‌సాగింపుగా స‌లార్ చిత్రం రూపొందుతుందా అని అంద‌రు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.  ఆద్య పాత్ర‌లో శృతి హాస‌న్ క‌నిపించ‌నుండ‌గా, ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటిస్తున్నారు.ఇక వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కనిపించనున్నారు. ‘పొగరు’ ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి ఇతర కీలక పాత్రలలో క‌నిపించి మెప్పించ‌నున్నారు. కేజీఎఫ్ చిత్రానికి సంగీతం అందించిన‌ రవి బస్రూర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...