Home Film News Bimbisara : సాంగ్ అదిరిందిగా..
Film News

Bimbisara : సాంగ్ అదిరిందిగా..

Bimbisara Song
Bimbisara Song

Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్.. హీరోగానే కాకుండా తాత ఎన్టీఆర్ పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి పలు హిట్ సినిమాలు నిర్మించి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. అదే బ్యానర్ మీద ఇప్పుడు తన బావమరిది కె.హరికృష్ణను నిర్మాతగా పరిచయం చేస్తూ ‘బింబిసార’ అనే క్రేజీ, ప్రెస్టీజియస్ ఫిలిం చేస్తున్నాడు.

ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్ ఆకట్టుకున్నాయి. ట్రైలర్ సినిమాల మీద అంచనాలు పెంచేసింది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌లో, రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపిస్తున్న కళ్యాణ్ రామ్ ఈసారి సాలిడ్ హిట్ కొట్టబోతున్నాడనే పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ఇటీవల ‘ఈశ్వరుడే’ సాంగ్ చాలా బాగా ఆకట్టుకుంది.

ఇప్పుడు ‘Folk Melody of the Season’ అంటూ ‘ఓ తేనె పలుకుల అమ్మాయి, నీ తీగ నడుములో సన్నాయి.. లాగిందే..’ అనే బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. వరికుప్పల యాదగిరి ట్యూన్ కంపోజ్ చేసి, లిరిక్స్ రాశారు. హిమత్ మొహ్మద్, సత్య యామిని అందంగా పాడారు.

కేథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు.. వారీనా హుస్సేన్, వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి, బ్రహ్మాజీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సాంగ్ విజువల్స్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ అలరించేలా ఉన్నాయి. జూలై 23 సాయంత్రం వీడియో సాంగ్ రిలీజ్ చెయ్యబోతున్నారు. ఆగస్టు 5న ‘బింబిసార’ వరల్డ్ వైడ్ భారీ స్థాయిలో విడుదల కానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...