Home Film News Bimbisara Trailer : ట్రైలర్ అదిరింది.. కళ్యాణ్ రామ్ ఈసారి గట్టిగా కొట్టేలా ఉన్నాడుగా!
Film News

Bimbisara Trailer : ట్రైలర్ అదిరింది.. కళ్యాణ్ రామ్ ఈసారి గట్టిగా కొట్టేలా ఉన్నాడుగా!

Bimbisara Trailer
Bimbisara Trailer

Bimbisara Trailer: హీరోగానే కాకుండా తాత ఎన్టీఆర్ పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి పలు హిట్ సినిమాలు నిర్మించి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న నందమూరి కళ్యాణ్ రామ్.. ఇప్పుడు తన బావమరిది కె.హరికృష్ణను నిర్మాతగా పరిచయం చేస్తూ ‘బింబిసార’ అనే ప్రెస్టీజియస్ ఫిలిం చేస్తున్నాడు.

మల్లిడి వశిష్ట్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌లో కళ్యాణ్ రామ్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించనున్నాడు. కేథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు.. వారీనా హుస్సేన్, వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి, బ్రహ్మాజీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

జూలై 5న కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా జూలై 4న హైదరాబాద్ ఏఎంబీ సినిమాస్‌లో గ్రాండ్‌గా ‘బింబిసార’ ట్రైలర్ రిలీజ్ చేశారు. కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. గెటప్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ చాలా బాగున్నాయి. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ ప్రతీది హైలెట్ అయ్యాయి. ఆగస్టు 5న ‘బింబిసార’ వరల్డ్ వైడ్ భారీ స్థాయిలో విడుదల కానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...