Home Film News సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి సర్కారు వారి పాట!
Film News

సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి సర్కారు వారి పాట!

Sarkaaru Vaari Paata To Be Released On Junuary 13

వరుస హిట్లతో దూసుకుపోతున్న మహేష్ బాబు మరో హిట్ తో తన అభిమానుల ముందుకు రాబోతున్నాడు సర్కారు వారి పాట సినిమాతో. ఒక సామాజిక సమస్యని ప్రధాన కథాంశంగా తీసుకుని ఈ మూవీ తెరమీదకి వస్తుందని చెప్తున్నారు మూవీ టీం. దర్శకుడు పరుశురామ్ కూడా మహేష్ తో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు చాలా గ్రేట్ ఫుల్ గా ఉన్నాడు. ఇప్పటిదాకా ఆయన చేసిన గీతా గోవిందం మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో పరుశురామ్ కి మహేష్ ఈ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆగస్ట్ 9 న మహేష్ బాబు పుట్టినరోజు కూడా ఉండటంతో.. ఆ సంధర్భంగా టీజర్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మూవీ వరుసగా హిట్ సినిమాలు చేసుకుపోతున్న నేషనల్ ఫిల్మ్ అవార్డీ కీర్తి సురేష్ ఈ మూవీలో నటించబోతోంది. పక్కా మాస్ సినిమాగా వచ్చే అవకాశం కనిపిస్తుంది పోస్టర్ చూసిన తర్వాత. ఎర్ర కారు లోంచి పవర్ ఫుల్ గా కాలు బయటికి పెట్టి ఉన్న ఫోటో రిలీజ్ అయింది. ఇక ఇప్పటికే మాస్ లుక్ లో చెవికి పోగు.. మెడ మీద రూపాయి టాటూ వేసుకుని కనిపించిన పోస్టర్ వైరల్ ఐన విషయం తెలిసిందే.

ఐతే, అదే సంక్రాంతి పెద్ద హీరోలైన ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల నుంచి కూడా సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ రాధే శ్యామ్ తో ప్రేక్షకులని పలకరించాలి అనుకుంటుంటే.. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కోషియుమ్ రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. ఇక ఈ ముగ్గురు బడా హీరోల సినిమాలు ఒకదానితో ఒకటి ఎలా పోటీ పడతాయో చూడాలి మరి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...