Home Special Looks రాబోయే నెలల్లో భారీ అంచనాలతో రాబోతున్న సినిమాలివే..
Special Looks

రాబోయే నెలల్లో భారీ అంచనాలతో రాబోతున్న సినిమాలివే..

సినీ అభిమానులు కరోనా కారణంగా చాలా కాలంగా థియేటర్ లో సినిమాలు చూడటాన్ని బాగా మిస్ అయ్యారు. ఈ మధ్యనే థియేటర్లు మళ్ళీ మొదలయినప్పటికీ తమకి నచ్చిన హీరోల సినిమాలు ఇంకా చూసే అవకాశం రాలేదనే చెప్పాలి. చిన్న చిన్న సినిమాలు ఎప్పటికప్పుడు విడుదల అవుతూనే ఉన్నా.. ప్రత్యేకంగా కొన్ని పెద్ద సినిమాలని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఊరిస్తున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. అవి విడుదల ఐన వెంటనే థియేటర్ లో ఎంజాయ్ చేయాలి అనుకునే పెద్ద సినిమాలు రాబోతున్న కాలంలో ఏవేవి ఉన్నాయో చూద్దాం.

ఆ మూవీని కన్నడలో తీసినప్పటికీ.. అటు హిందీ, ఇటు తెలుగులో కూడా భారీగా హిట్ సాధించింది. ఆ మూవీనే KGF. కథ ఎంత సింపుల్ గా అనిపిస్తుందో అంతే సంక్లిష్టంగా కూడా ఉంటుంది. మొదటి భాగం ఏ స్థాయిలో ఘనవిజయం సాధించిందో మనమంతా చూశాం. ఇక రెండో పార్ట్ “KGF2” కోసం దేశంలో ఎంతోమంది ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. యష్ ని యాక్షన్ లో చూడటంతో పాటు.. అద్భుతమైన ఆ మాస్ BGM ని మళ్ళీ ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారు. అలాగే, కథ ఎలా unfold అవుతుందో చూడాలి అన్న ఉత్సుకత చాలామందిలో ఉంది. ఈ మూవీ పక్కా రిలీజ్ డేట్ ఇంకా తెలియకపోవడంతో ఫాన్స్ చాలా frustrate అవుతున్నారు. కానీ, షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 9 న తెరమీదకు వచ్చేయనుంది.

ఇక ‘అర్జున్ రెడ్డి’ తో ఎంతో ఫేమ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అటు బాలీవుడ్ లోకి కూడా అడుగుపెడుతూ వస్తున్న చిత్రం “లైగర్”. ఇదివరకే NOTA సినిమాతో తమిళ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఈ మూవీతో ఏ స్థాయిలో హిందీ ఆడియన్స్ విషయంలో రాణిస్తాడో చూడాలి. ఈ మూవీ కూడా షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 9 న రావాల్సి ఉంది.

ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి తీస్తున్న మరో సినిమా “RRR”. ఈ మూవీ కోసం కూడా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటిదాకా రాజమౌళి చేసిన సినిమాలన్నీ భారీ హిట్లుగా మారడంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకులకి ఎన్నో ఆంచానాలు ఉన్నాయి. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులుగా ఎంతో భిన్నమైన కథతో వస్తున్న ఈ మూవీ ఎలా ఉండబోతుంది అన్న విషయం మీద చాలా మంది ఆసక్తగా ఉన్నారు. మల్టీ స్టారర్ కూడా కావడంతో చరణ్, ఎన్టీఆర్ ఫాన్స్ ఇద్దరూ desperate గా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మూవీ దసరా కానుకగా అక్టోబర్ 13 న విడుదల కాబోతుంది.

అలాగే రామ్ చరణ్.. నాన్న చిరంజీవితో కలిసి ఇంకో సినిమా చేస్తున్నాడు. అదే “ఆచార్య”. ఈ మూవీ కథ కూడా మావోయిస్ట్ నేపథ్యంలో ఎంతో భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఐతే, ఆచార్య కూడా షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ లో రిలీజ్ కి ఉంది.

ఇక క్లాస్ డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ తో చేస్తున్న మూడో సినిమాపై కూడా ప్రేక్షకులకి ఎన్నో అంచనాలు ఉన్నాయి. అదే “పుష్ప”. చాలాకాలం క్రితమే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ మూవీ సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ పోస్ట్ పోన్ ఔతూ వచ్చింది. ఇక ఫాన్స్ సహనాన్ని పరీక్షించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదనుకుని ఈ క్రిస్మస్ కి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఇక సంక్రాంతికి కూడా ప్రేక్షకులు ఈ సారి భారీగా ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయబోతున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్-రానా ప్రత్యర్థులుగా నటిస్తున్న చిత్రం ఇది. మలయాళంలో హిట్ ఐన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకి ఇది రీమేక్ గా వస్తోంది. జనవరి 12 న రిలీజ్ అవబోతున్న ఈ మూవీ కోసం ఫాన్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇక మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సర్కారువారి పాట మూవీ కోసం మహేష్ ఫాన్స్ చాలా ఆతురతగా ఉన్నారు. ఈ మూవీ జనవరి 13 న విడుదల కాబోతుంది. అలాగే బాహుబలి ఫేమ్ ప్రభాస్ సాహో సినిమా తర్వాత చేస్తున్న రిలీజ్ “రాధే శ్యామ్”. జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూడు సినిమాలతో సంక్రాంతి అందరికీ గ్రాండ్ సెలబ్రేషన్ అవబోతుంది అన్నమాట.

ఇక రానా, సాయి పల్లవి జంటగా మరో మావోయిస్ట్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రం “విరాట పర్వం”. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కూడా ప్రేక్షకులని ఆకర్షిస్తోంది. ఈ మూవీ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక బాలక్రిష్ణ “అఖండ”, పవన్ కళ్యాణ్ మరో సినిమా “హరిహర వీరమల్లు”, జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివతో ఒక సినిమా, అలాగే kgf ఫేమ్ ప్రశాంత్ నీల్ తో మరో సినిమా చేయబోతున్నాడు. ఇక అదే ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో “సలార్” సినిమా మేకింగ్ లోనూ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్న మరో ప్రభాస్ సినిమా “ఆది పురుష్” కూడా ఆ తర్వాత రోజుల్లో హాట్ సినిమాలుగా మారబోతున్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

ప‌ట్టుమ‌ని ప‌ది హిట్లు కూడా లేని రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్ ఎలా అయ్యాడు.. చ‌ర‌ణ్ రిజెక్ట్ చేసిన సినిమాలేవో తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. సామాన్యుడి నుంచి...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

ఎన్టీఆర్ ను అగ్ర‌హీరోగా మార్చిన అడ‌వి రాముడు అప్ప‌ట్లో ఎంత వ‌సూల్ చేసింది.. అడవి రాముడు పేరిట ఉన్న రికార్డులు ఏంటి?

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి గుండెల్లో నిలిచిన మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు...

సినిమాల్లోకి రాక‌ముందు నాగ శౌర్య ఏం చేసేవాడు.. ఆ హీరోయిన్ల‌తో ఎఫైర్‌ నిజ‌మేనా..!?

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల్లో నాగ శౌర్య ఒక‌రు. ఊహలు గుసగుసలాడే సినిమాతో...