Home Film News Pawan Loss: భీమ్లా నాయ‌క్ వ‌ల‌న 30 కోట్ల న‌ష్టం.. క‌క్ష క‌ట్టి లాస్ వ‌చ్చేలా చేశార‌న్న ప‌వ‌న్
Film News

Pawan Loss: భీమ్లా నాయ‌క్ వ‌ల‌న 30 కోట్ల న‌ష్టం.. క‌క్ష క‌ట్టి లాస్ వ‌చ్చేలా చేశార‌న్న ప‌వ‌న్

Pawan Loss: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం ఏపీలో బిజీబిజీగా గ‌డుపుతున్నారు. కొన్నాళ్లు సినిమాల‌కి బ్రేక్ ఇచ్చి ఇప్పుడు త‌న దృష్టి అంతా రాజ‌కీయాల‌పై పెట్టారు. గ‌త కొద్ది రోజులుగా వారిహి విజ‌య యాత్ర చేస్తున్న ప‌వ‌ర్ స్టార్.. వైసీపీ ప్ర‌భుత్వంపై దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేస్తూ హాట్ టాపిక్‌లుగా నిలుస్తున్నారు. తాజాగా ఆయ‌న భీమ్లా నాయ‌క్ సినిమా విష‌యంలో త‌న‌కు చేసిన అన్యాయంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నాపై కక్షకట్టి సినిమా టికెట్‌ రేట్లు తగ్గించారని, తనని ఆర్థికంగా దెబ్బతీసేందుకే ఇలాంటి కుట్ర చేశారని ఆయన ఆరోపించారు.

న‌న్ను ఇబ్బంది పెట్టేందుకే ఏపీలో సినిమా టికెట్‌ రేట్లు తగ్గించారని, అందుకు అర్థరాత్రి జీవో తీసుకొచ్చారని పవన్‌ ఆరోపించారు. స‌డెన్‌గా టిక్కెట్స్ త‌గ్గించ‌డం వ‌ల‌న భీమ్లా నాయ‌క్ చిత్రానికి రూ.30 కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ని ఆయ‌న తెలియ‌జేశారు. నేను న‌టించిన వకీల్ సాబ్ సినిమా సమ‌యంలో కూడా అంతే చేశారు. సినిమా టిక్కెట్ ధ‌ర పది రూపాయలు పెడితే చిత్రానికి పెట్టిన బడ్జెట్ ఎన్న‌టికితిరిగి వస్తుంది? అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రశ్నించారు. నేను చేసిన రెండు సినిమాలు పెద్ద హిట్‌ కానీ, ఏపీలో మాత్రం నిర్మాతలకు నష్టం వాటిల్లింది. ఆ భారాన్ని నేనే భ‌రించాల్సి వ‌చ్చింది అని ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

జ‌నసేన కార్య‌క‌ర్త‌ల‌తో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. `భీమ్లా నాయక్‌` సినిమా విష‌యానికి వ‌స్తే చిత్రానికి సాగర్‌ కే చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు. 2022 ఫిబ్రవరి 25న ఈ చిత్రం విడుదలైంది. కలెక్షన్ల పరంగా ఈ చిత్రం వంద కోట్లు వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ప్ప‌టికీ , ఏపీలో టికెట్‌ రేట్లు తక్కువగా ఉండటంతో నిర్మాత‌ల‌కి, బ‌య్య‌ర్స్‌కి చాలా న‌ష్టం వాటిల్లింది. ఇక వ‌కీల్ సాబ్ చిత్రం 2021 ఏప్రిల్‌ 9న రిలీజ్‌ అయ్యింది. ఆ సమయంలో కరోనా ఎఫెక్ట్, మరోవైపు ఏపిలో టికెట్‌ రేట్ల తగ్గింపు కారణంగా ఈ చిత్రం మంచి విజ‌యం సాధించిన కూడా భారీ వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేక‌పోయింది.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...