Home Film News హీరో కావాల్సిన అల్లు అర‌వింద్ నిర్మాత‌గా మార‌డానికి కార‌ణం.. అయ‌న న‌లుగురు కుమారుల్లో ఒక‌రు ఎలా చ‌నిపోయారు..?
Film NewsSpecial Looks

హీరో కావాల్సిన అల్లు అర‌వింద్ నిర్మాత‌గా మార‌డానికి కార‌ణం.. అయ‌న న‌లుగురు కుమారుల్లో ఒక‌రు ఎలా చ‌నిపోయారు..?

ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ ను ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ సక్సెస్ ఫుల్‌ నిర్మతల్లో అల్లు అరవింద్ ఒకరు. పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అల్లు అరవింద్.. తనదైన టాలెంట్, విజన్, కాలానుగుణంగా ప్రణాళికలు రచిస్తూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.పేరుకు నిర్మాతే అయినప్పటికీ హీరోలకు ఏమాత్రం తీసుకొని క్రేజ్, ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించారు. మెగా కాంపౌండ్ కు పునాది వేశారు. చిరంజీవి మెగాస్టార్ గా నిలిచారు అంటే దాని వెనక అల్లు అరవింద్ కృషి ఎంతో ఉంది అనడంలో సందేహం లేదు.

అల్లు రామలింగయ్యకు వేషాలివ్వద్దని దర్శకులకు చెప్పిన అల్లు అరవింద్....  దర్శకేంద్రుడు బయటపెట్టిన చేదు నిజం!

అలాగే మెగా ఫ్యామిలీ నుంచి అర డజన్‌కు పైగా హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా అల్లు అరవింద్‌దే. అటువంటి ఆయన గురించి అనేక ఆసక్తికర విషయాల‌ను ఈ వీడియోలో తెలుసుకుందాం. 1949 జనవరి 10 న ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అల్లు అరవింద్ జన్మించారు. ఆయ‌న‌ తండ్రి అల్లు రామలింగయ్య 1000 చిత్రాలలో నటించిన ప్రముఖ తెలుగు హాస్య నటుడు కాగా.. త‌ల్లి అల్లు కనకరత్నం గృహిణి. అల్లు అర‌వింద్ కు సురేఖ‌తో స‌హా ముగ్గురు సోద‌రీమ‌ణులు ఉన్నారు. చిన్నతనం నుంచి సినిమా వాతావరణంలో పెరగడం వల్ల అల్లు అరవింద్ కు నటనపై ఆసక్తి కలిగింది. తండ్రి బాటలో తొలిత అరవింద్ కూడా నటుడు కావాలని భావించారు. అయితే కొన్నాళ్లకు ఆయన మనసు మారింది. ఒకరి చిత్రాల్లో నటించడం కాకుండా.. తానే చిత్రాలు నిర్మించే స్థాయికి ఎదగాలని అభిలాషించారు. అందులో భాగంగానే 1972లో చిత్ర నిర్మాణ మరియు పంపిణీ సమస్థ అయిన‌ గీత ఆర్ట్స్ ను అల్లు అర‌వింద్ స్థాపించారు.

Chiranjeevi presents Allu Ramalingaiah award to Dasari Narayana Rao -  Photos,Images,Gallery - 65415

కృష్ణంరాజు, చలం, విజయనిర్మల ప్ర‌ధాన పాత్ర‌ల్లో దాసరి నారాయణరావు గారు తెర‌కెక్కించిన బంట్రోతు భార్య మూవీ గీత ఆర్ట్స్ పై నిర్మిత‌మైన తొలి చిత్రం. ఆపై దాస‌రి గారి ద‌ర్శ‌క‌త్వంలోనే దేవుడే దిగివస్తే అనే చిత్రాన్ని అల్లు అర‌వింద్ నిర్మించారు. ఇవి మంచి విజ‌యం సాధించ‌డంతో అల్లు అర‌వింద్ ధైర్యంగా ముంద‌డుగు వేశారు. మావుల్లో మహాశివుడు, శుభలేఖ, యమకింకరుడు, హీరో, విజేత‌, ఆరాధ‌న‌, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, రౌడీ అల్లుడు, మెకానిక్ అల్లుడు, పెళ్లి సంద‌డి.. ఇలా వ‌రుస పెట్టి సినిమాలు నిర్మించారు. పవ‌న్ క‌ళ్యాణ్ డెబ్యూ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, అల్లు అర్జున్ తొలి చిత్రం గంగోత్రి, రామ్ చ‌ర‌ణ్ ఇండ‌స్ట్రీ హిట్ మూవీ మ‌గ‌ధీర‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ మొద‌టి చిత్రం పిల్లా నువ్వు లేని జీవితం చిత్రాలు కూడా గీతా ఆర్ట్స్ పైనే నిర్మితం అయ్యాయి. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్, క‌న్న‌డ భాష‌ల్లోనూ అనేక చిత్రాల‌కు అల్లు అర‌వింద్ ప్రొడ్యూస‌ర్ గా ప‌ని చేశారు. ఓ చిత్రాన్ని ఎంత బడ్జెట్ లో నిర్మించవచ్చు..దాని ప్రమోషన్ ఎలా ఉండాలో పక్కాగా ప్లాన్ చేయడంతో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. గీతా ఆర్ట్స్ పై ఒక సినిమా విడుద‌ల అవుతుందంటే ఖ‌చ్చితంగా అది హిట్ అనే టాక్ ఇండ‌స్ట్రీలో బ‌లంగా నాటుకుపోయింది.

No photo description available.

అలాంటి ఇమేజ్‌ను అల్లు అర‌వింద్ క్రియేట్ చేశారు. అలాగే చిరంజీవిని మెగాస్టార్ గా నిలిపిన అల్లు అరవింద్.. మెగా కాంపౌండ్ కు కూడా రూపశిల్పిగా వ్య‌వ‌హ‌రించారు. చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ వంటి వారిని ఇండ‌స్ట్రీలో హీరోలుగా నిల‌బెట్టారు. నిర్మాత‌గా, డిస్ట్రిబ్యూట‌ర్ గా దాదాపు నాలుగు ద‌శాబ్దాల నుంచి అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్న అల్లు అర‌వింద్‌.. క‌రోనా స‌మ‌యంలో ఓటీటీ రంగంలోకి కూడా దిగారు. ఆహా పేరుతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ను నెల‌కొల్పి సూప‌ర్ స‌క్సెస్ అయ్యారు. చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. అల్లు అర‌వింద్ న‌టుడిగా కూడా కొన్ని చిత్రాలు చేశారు. 1979లో విడుద‌లైన మావుల్లో మహాశివుడు చిత్రంలో సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా తొలిసారి వెండితెర‌పై మెరిపించారు. ఆ త‌ర్వాత హీరో, మహానగరంలో మాయగాడు, చంటబ్బాయి వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌ల‌ను పోషించారు.

Allu Aravind – Allu Arjun & Allu Sirish

కెరీర్ ప‌రంగా అత్యంత శక్తివంతమైన మరియు విజయవంతమైన వ్య‌క్తిగా నిరూపించుకున్న అల్లు అర‌వింద్‌.. ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ను కూడా ఎంతో చ‌క్క‌గా బ్యాలెన్స్ చేశారు. త‌న త‌ల్లిదండ్రులు చూపించిన నిర్మల గారి మెడ‌లో అల్లు అర‌వింద్ మూడు ముళ్లు వేశారు. వీరికి న‌లుగురు సంతానం. పెద్ద కుమారుడు అల్లు వెంకట్ అలియాస్ బాబి బిజినెస్ రంగంలో ఉన్నారు. అలాగే మ‌రో ఇద్ద‌రు కుమారులు అల్లు అర్జున్, అల్లు శిరీష్ హీరోలుగా స‌త్తా చాటుతున్నారు. ఈ ముగ్గురు అంద‌రికీ సుప‌రిచిత‌మే. కానీ, అల్లు అర‌వింద్ కు మ‌రో త‌న‌యుడు ఉండేవాడు. అతని పేరు అల్లు రాజేష్‌. శిరీష్ కంటే ముందు అంటే మూడో త‌న‌యుడిగా రాజేష్ జ‌న్మించాడు. అయితే అత‌ను ఏడేళ్ళ వయసులోనే ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కొన్నేళ్ల త‌ర్వాత నిర్మ‌ల గారికి శిరీష్ జ‌న్మించ‌డంతో చ‌నిపోయిన రాజేష్ మళ్లీ పుట్టాడని అంతా భావించి సంభ‌రాలు చేసుకున్నారు. మ‌రియు శిరీష్ ను ఇంట్లో వారంతా ఎంతో గారాబంగా పెంచారు. ఇక ఆస్తుల విష‌యానికి వ‌స్తే.. సినిమా ప‌రిశ్ర‌మ‌లో అల్లు అర‌వింద్ భారీగా ఆస్తులు కూడ‌బెట్టారు. ప‌లు నివేదిక‌ల ప్ర‌కారం.. అల్లు అర‌వింద్ నిక‌ర విలువ రూ. 165 కోట్లు ఉంటుంద‌ని తెలుస్తోంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...