Home Film News Prabhas 20 Years : ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ కన్ఫమ్ చేసిన కృష్ణంరాజు
Film News

Prabhas 20 Years : ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ కన్ఫమ్ చేసిన కృష్ణంరాజు

Prabhas 20 Years
Prabhas 20 Years

Prabhas 20 Years: టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటుడిగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ‘బాహుబలి’ తో తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిచెప్పారు ప్రభాస్-రాజమౌళి. దేశ విదేశాల్లోనూ ప్రభాస్‌కి ఫ్యాన్స్ పెరిగారు. ముందు ముందు పాన్ వరల్డ్ స్థాయిలో అతను నటించే సినిమాలు తెరకెక్కబోతున్నాయి.

‘ఆదిపురుష్’ తో బాలీవుడ్‌లోకి ఎంటర్ అవుతున్నారు. ‘సలార్’ పాన్ ఇండియా, ‘ప్రాజెక్ట్-K’ పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతుండగా.. 25వ సినిమా ‘స్పిరిట్’ ఎనిమిదికి పైగా భాషల్లో రూపొందనుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా, ఆయన తమ్ముడు సూర్య నారాయణ రాజు తనయుడు ‘ఈశ్వర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ మొట్టమొదటిసారిగా కెమెరా ముందు నిల్చుని జూన్ 28కి 20 ఇయర్స్ అవుతోంది.

ఈ సందర్భంగా కృష్ణంరాజు, ఆయన సతీమణి శ్యామలా దేవి వారి నివాసంలో కేక్ కట్ చేసి, మీడియా ద్వారా తమ ఆనందాన్ని, అనుభూతుల్ని పంచుకున్నారు. స్టార్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో, నటుడు అశోక్ కుమార్ ‘అశోక్’ మూవీని నిర్మించారు.

కృష్ణంరాజు మాట్లాడుతూ.. ‘‘ప్రభాస్ నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి అప్పుడే 20 ఏళ్లైపోయిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ సినిమా ‘ఈశ్వర్’ ఓపెనింగ్‌కి అన్ని చోట్ల నుండి భారీగా అభిమానులు, ప్రేక్షకులు తరలివచ్చారు. ప్రేక్షకాభిమానుల ఆశీస్సుల వల్లే ప్రభాస్ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు.

ఇరవై సంవత్సరాలకి ఇరవై దేశాల్లో హీరో అయ్యాడు. రీసెంట్‌గా తెలిసింది, ప్రభాస్‌ని హాలీవుడ్‌కి కూడా ఇంట్రడ్యూస్ చెయ్యబోతున్నారని.. ‘ఆదిపురుష్’ సినిమాని హాలీవుడ్‌లో రిలీజ్ చెయ్యబోతున్నారని తెలిసింది. ఇది కనుక నిజమైతే ప్రభాస్ ఎంత ఎత్తుకెదిగాడు, మన దేశం, తెలుగు సినిమా పరిశ్రమ ఎంతగా అభివృద్ధిచెందిదో తెలుస్తుంది. ఈ 20 సంవత్సరాలకి ప్రభాస్ ఎవరూ అఛీవ్ చెయ్యలేని, ఇకముందు చెయ్యబోనిది అఛీవ్ చేశాడు’’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...