Home Film News Diesel Movie : పెట్రోల్ బంకులో ప్రేమకథ.. హీరో ఎవరో గుర్తుపట్టారా?
Film News

Diesel Movie : పెట్రోల్ బంకులో ప్రేమకథ.. హీరో ఎవరో గుర్తుపట్టారా?

Diesel First Look
Diesel First Look

Diesel Movie: మారుతున్న కాలంతో పాటు ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతూ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఆడియన్స్‌కి ఎప్పటికప్పుడు డిఫరెంట్ జోనర్, కొత్త కథలు చెప్పడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తూనే ఉంటారు.

ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చెయ్యడం అనేది నెమ్మదిగా తగ్గి, కథ మీద నమ్మకంతో ఒకేసారి రెండు భాషల్లోనూ షూటింగ్ చెయ్యడానికి, రిలీజ్ చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పుడు అలాంటి ఓ లవ్ కమ్ థ్రిల్లర్ మూవీ రాబోతుంది. ‘డీజిల్’ అనే టైటిల్ కన్ఫమ్ చేస్తూ.. తెలుగు, తమిళ్ భాషల్లో ఫస్ట్ లుక్ పోస్టర్స్ వదిలారు. హరీష్ కళ్యాణ్, అతుల్య రవి హీరో హీరోయిన్లు.. పెట్రోల్ బంకు నేపథ్యంలో సాగే ప్రేమకథ, అందులో ఊహించని ట్విస్ట్ కూడా ఉంటుందని పోస్టర్స్ చూస్తే అర్థమవుతుంది.

హీరో హరీష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. తమిళ్‌లో నాలుగు సినిమాలు చేశాక.. ఉదయ్ కిరణ్ ‘జై శ్రీరామ్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ‘కాదలి’ అనే సినిమాలో ఒక హీరోగా చేశాడు. నాని ‘జెర్సీ’ లో నాని కొడుకు క్యారెక్టర్ (పెద్దయ్యాక) చేసి మెప్పించాడు. షణ్ముగం ముత్తుస్వామి డైరెక్ట్ చేసిన ‘డీజిల్’ తమిళ్‌తో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...