Home Film News Meena Husband : నటి మీనా భర్త విద్యా సాగర్ ఇకలేరు
Film News

Meena Husband : నటి మీనా భర్త విద్యా సాగర్ ఇకలేరు

Meena Family
Meena Family

Meena Husband: ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త విద్యా సాగర్ కన్నుమూశారు. కొద్ది కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న విద్యా సాగర్ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన వయసు 48 సంవత్సరాలు.

ఈ ఏడాది జనవరిలో మీనా కుటుంబం కోవిడ్ బారిన పడింది. మీనా, కుమార్తె నైనికా కోలుకున్నారు కానీ విద్యా సాగర్‌కి శ్వాసకోస సమస్య ఏర్పడింది. దీంతో చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. పరిస్థితి విషమించడంతో విద్యా సాగర్ తుదిశ్వాస విడిచారు.

సౌత్‌లో స్టార్ హీరోలందరితోనూ నటించిన మీనా.. 2009లో బెంగుళూరుకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యా సాగర్‌ని పెళ్లి చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. అప్పటినుండి ఫ్యామిలీకే పూర్తి టైం కేటాయించిన మీనా అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ఈమధ్య టీవీ షోస్‌లోనూ పాల్గొంటున్నారు.

వీరికి నైనికా అనే ఓ పాప ఉంది. తనని దళపతి విజయ్ ‘తేరి’ తెలుగులో ‘పోలీసోడు’ సినిమాతో బాలనటిగా ఇంట్రడ్యూస్ చేశారు. మీనా భర్త మరణవార్త తెలియగానే పలు భాషలకు చెందిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...