Home Film News హనుమాన్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..ఎలా ఉందంటే..!?
Film NewsReviews

హనుమాన్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..ఎలా ఉందంటే..!?

ఈసారి సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద ఐదు స్ట్రైట్ సినిమాలు పోటీ పడడానికి రెడీగా ఉన్నాయి. స్టార్ హీరోల మధ్య జరుగుతున్న ఈ సంక్రాంతి పోరు తెలుగు ఆడియన్స్ లో ఆసక్తిని పెంచేసింది. మరి ఈ బాక్స్ ఆఫీస్ ఫైట్ లో విన్నర్ గా నిలిచేది ఎవరు అని ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తేజ సజ్జ హీరోగా నటిస్తున్న సూపర్ హీరో “హనుమాన్” మూవీపై అందరి దృష్టి ఉంది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ భారీ అంచనాలతో పాన్ ఇండియా మూవీగా జనవరి 12న థియేటర్లలోకి రాబోతోంది. హను-మాన్’ టీజర్, ట్రైలర్..లు అందరినీ మెస్మరైజ్ చేశాయి. అందులోని విజువల్స్ అందరినీ కట్టి పారేశాయి.

Hanu-Man director Prasanth Varma announces his cinematic universe

ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా?’ అనే క్యూరియాసిటీని కూడా అందరిలోనూ క్రియేట్ చేశాయి. మరోపక్క ‘గుంటూరు కారం’ ‘సైంధవ్’ ‘నా సామి రంగ’ వంటి పెద్ద సినిమాల పక్కన నలిగిపోతుంది అనే సింపతీ కూడా ‘హను-మాన్’ పై ప్రేక్షకుల్లో ఉంది. ఆ ధైర్యంతోనే ‘హను -మాన్’ మేకర్స్ ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ వేసేందుకు రెడీ అయ్యారు. తాజాగా కొంతమంది సినీ ప్రముఖుల కోసం “హనుమాన్” మూవీ స్పెషల్ షోలు వేయగా, ఈ మూవీ ఎలా ఉంది అనే టాక్ బయటకు వచ్చింది.

HanuMan - Trailer | Teja Sajja | Amritha Aiyer, Varalakshmi | Prasanth Varma | S S Rajamouli Direct - YouTube

సినిమా చూశాక వాళ్ళు పాజిటివ్ రెస్పాన్స్ చెప్పడం విశేషంగా చెప్పుకోవాలి. హనుమంతు అనే కుర్రాడు హనుమంతుడు అనుగ్రహంతో పుడితే.. అతనికి సూపర్ నేచురల్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది అన్నది ‘హనుమాన్’ కథగా తెలుస్తుంది. ‘హనుమాన్’ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుందట. ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ ని మించి ఉంటుందట. అక్కడక్కడా పడినట్టు అనిపించినా..

Hanu Man: థియేటర్స్‌లోకి రానేలేదు.. అప్పుడే.. హనుమాన్ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. - Telugu News | makers have given clarity on the OTT release of Teja Sajja Hanuman ...

విజువల్స్ సినిమాని నిలబెట్టాయి అని అంటున్నారు. గెటప్ శీను కామెడీ హైలెట్ గా ఉంటుందట. సత్య, వెన్నెల కిషోర్ కూడా బాగా చేశారని అంటున్నారు. విలన్ వినయ్ రాయ్ రోల్ కూడా అలరిస్తుంది అని అంటున్నారు. ఈ సినిమాకు రవితేజ వాయిస్ ఓవర్ అందించడం విశేషం. అంతేకాదు ఈ సినిమాలో చిరంజీవి ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. మ‌రీ ‘ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ప్రేక్షకులను ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది అని, ‘హనుమంతుడు’ ప్రత్యక్షమైనప్పుడు అందరూ స్టన్ అయిపోవడం మాత్రమే కాకుండా ప్రేక్షకులు తెలీకుండానే చెప్పులు తీసి పక్కన పెట్టి తమ భక్తిని చాటుకుంటారని’ సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. .

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...