Home Film News Nagarjuna: నాగార్జున ప‌ని అయిపోయిన‌ట్టేనా..రెండు ఆఫ‌ర్స్ క్యాన్సిల్..!
Film News

Nagarjuna: నాగార్జున ప‌ని అయిపోయిన‌ట్టేనా..రెండు ఆఫ‌ర్స్ క్యాన్సిల్..!

Nagarjuna: అక్కినేని నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఆయ‌న త‌న కెరీర్‌లో చేయ‌ని ప్ర‌యోగాలు లేవు. రొమాన్స్, భ‌క్తిర‌స చిత్రాల‌తో పాటు యాక్ష‌న్ చిత్రాల‌లోను న‌టించి మెప్పించాడు.  అయితే ఇటీవ‌లి కాలంలో నాగార్జున ప‌రిస్థితి దారుణంగా మారింది. ఆయ‌న చేసిన సినిమాలు ఫ్లాపులు బాట ప‌డుతున్నాయి.  నాగార్జున  చివ‌రిగా న‌టించిన ది ఘోస్ట్ రిలీజై ఎనిమిది నెల‌లు దాటినా అక్కినేని నాగార్జున నెక్స్ట్ సినిమా గురించి ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అప్‌డేట్ లేదు. ధ‌మాకా చిత్ర‌ రైట‌ర్ బెజ‌వాడ ప్ర‌స‌న్న‌కుమార్ డైరెక్ష‌న్‌లో నాగార్జున ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. ధ‌మాకా సినిమా ప్ర‌మోష‌న్స్‌లో ప్ర‌స‌న్న‌కుమార్ కూడా నాగ్ సినిమాతో తాను  డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

కాని సినిమా అనౌన్స్‌మెంట్ లేకుండానే ఆగిపోయింది. బెజ‌వాడ ప్ర‌స‌న్న‌కుమార్ రెడీ చేసిన స్క్రిప్ట్ నాగార్జునకు న‌చ్చ‌క‌పోవ‌డంతోనే ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేద‌ని టాక్. అయితే ఈ సినిమాని  ప్రసన్న కుమార్‌.. `పొరింజు మరియమ్‌ జోష్‌` అనే మలయాళ సినిమా నుంచి కథ కాపీ కొట్టిన‌ట్టు స‌మాచారం. క‌థ‌ని గోదావరి బ్యాక్ డ్రాప్‌లో త‌న స్టైల్‌లో మార్చిన‌ట్టు తెలుస్తుండ‌గా,  ఫైన‌ల్ స్క్రిప్ట్ మాత్రం నాగ్‌కి న‌చ్చ‌లేద‌ని అంటున్నారు. మ‌రో వైపు నాగార్జున చేయాల్సిన మ‌రో చిత్రం  కూడా కాన్సిల్‌ అంటున్నారు. నాగార్జున‌.. ఓ సినిమాటోగ్రాఫర్‌ని దర్శకుడిగా పరిచేయం చేస్తూ సినిమా చేయాల‌ని అనుకున్నారు. కాని  ఆ స్క్రిప్ట్ విషయంలోనూ నాగ్ నిరాశ చెందిన‌ట్టు తెలుస్తుంది.

ఇలా నాగార్జున చేయాల‌నుకున్న రెండు సినిమాలు ఆగిపోయాయ‌ని, ఆయ‌న నుండి కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడు వ‌స్తుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. నాగార్జున ప‌రిస్థితే బాగోలేదంటే ఆయ‌న కుమారులు నాగ చైత‌న్య‌, అఖిల్ ల‌ని కూడా వ‌రుస ఫ్లాపులు ప‌ల‌క‌రిస్తున్నాయి.  మరోవైపు కింగ్ నాగ్  `బిగ్‌ బాస్‌ 7` షో నుంచి హోస్ట్ గా తప్పుకుంటున్నారని వార్త‌లు రాగా, అందులో  నిజం లేదని, ఆయనే షోకి హోస్ట్‌గా కొనసాగుతారని సమాచారం.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...