Home Film News Naga Chaitanya: నాగ చైత‌న్య గురించి పాజిటివ్‌గా స్పందించిన అమ‌ల‌.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌
Film News

Naga Chaitanya: నాగ చైత‌న్య గురించి పాజిటివ్‌గా స్పందించిన అమ‌ల‌.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Naga Chaitanya: టాలీవుడ్ హీరోల‌లో చాలా కూల్ అండ్ కామ్ గోయింగ్ ప‌ర్స‌న్ ఎవ‌రంటే అందరికి గుర్తొచ్చేంది నాగ చైతన్య‌. అక్కినేని మూడో త‌రం వార‌సురాలిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య హిట్, ఫ్లాప్స్ తేడా లేకుండా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇటీవ‌ల చైతూ  చేసే సినిమాలు ప్రేక్ష‌కుల‌ని తీవ్రంగా నిరాశప‌రుస్తున్నాయి. చివ‌రిగా చైతూ న‌టించిన క‌స్ట‌డీ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది. ఇప్ప‌డు ఆయ‌న త‌న త‌దుపరి చిత్రాన్ని చందూ మొండేటితో చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ఇందులో ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌కి ఛాన్స్ ఉండ‌గా,   ఓ కథానాయికగా కీర్తీ సురేష్ , మరో నాయికగా అనుపమ పరమేశ్వరన్   పేరును చందూ మొండేటి పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.  ఈ మూవీతో అయిన చైతూ మంచి హిట్ కొట్టాల‌ని అనుకుంటున్నాడు.

స‌మంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతూ ఆమెతో నాలుగేళ్ల కాపురం త‌ర్వాత విడిపోయారు. ప్ర‌స్తుతం సోలోగా ఉంటున్న అత‌ను సినిమాలపైనే పూర్తి దృష్టి సారిస్తున్నాడు. అయితే నాగ చైత‌న్య గురించి అమ‌ల తాజాగా ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేయగా, ఇవి నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.  నాగచైతన్య చాలా తెలివైన వ్య‌క్తి అని చెప్ని అమ‌ల.. అతనికి ఏం కావాలో దానిపై చాలా క్లారిటీతో ఉంటాడ‌ని పేర్కొంది. ఎప్పుడు త‌న కొడుకు గురించే మాట్లాడే అమ‌ల ఇప్పుడు నాగ చైత‌న్య గురించి గొప్ప‌గా మాట్లాడ‌డంతో ఇప్పుడు ఆమె వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమల అనేక విషయాల గురించి మాట్లాడిన ఆమె.. నాగచైతన్య గురించి ఒక్క మాటలో చెప్పమంటే అత‌ను తెలివైనవాడ‌ని, ధైర్య‌వంతుడ‌ని పేర్కొంది.చైతూని అమ‌ల ఈ ర‌కంగా పొగిడేస‌రికి ఆయ‌న అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఇక అఖిల్ గురించి కూడా మాట్లాడిన అమ‌ల‌.. అత‌నికి మనుషులంటే ఇష్టమట. పీపుల్‌ లవ్వింగ్‌ పర్సన్‌ అని, మనుషులను ఎక్కువగా ప్రేమిస్తాడని చెప్పుకొచ్చింది.ఇక‌ సోషల్‌ మీడియా కంటే ప్రింట్‌ మీడియా చాలా ఎక్కువ డ్యామేజ్‌ చేస్తుందని, అది క్యారెక్టర్‌ అసాసినేషన్‌ చేస్తుందంటూ అమ‌ల సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేసింది.

Related Articles

Betper bahis sitesi guncel giris 2023

Betper bahis sitesi guncel giris 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...