Home Film News Varun Tej: పెళ్లి కోసం ఐదు ప్లేసులు ప‌రిశీల‌న‌.. మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసిది ఆమెనేన‌ట‌..!
Film News

Varun Tej: పెళ్లి కోసం ఐదు ప్లేసులు ప‌రిశీల‌న‌.. మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసిది ఆమెనేన‌ట‌..!

Varun Tej: ఇటీవ‌ల మెగా ఫ్యామిలీ తెగ హాట్ టాపిక్ అవుతుంది. రామ్ చ‌రణ్ తండ్రి కావ‌డం, వ‌రుణ్ తేజ్ సైలెంట్ నిశ్చితార్థం జ‌రుపుకోవ‌డం, నిహారిక డైవ‌ర్స్ అనౌన్స్ చేయ‌డం వంటి అంశాల‌తో మెగా ఫ్యామిలీ అందరి దృష్టిని ఆక‌ర్షించింది. అయితే మొన్న‌టి వ‌ర‌కు నిహారిక విడాకులకి కార‌ణం ఏంటి? ఎవ‌రిది తప్పు అంటి అంశాల‌పై జ‌నాలు ముచ్చ‌టించుకున్నారు.ఇప్పుడు అది వ‌దిలేసి వ‌రుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడు, ఎక్క‌డ చేసుకుంటాడు, ఎవ‌రెవ‌రిని పిలుస్తాడు వంటి వాటిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఈ క్ర‌మంలో వ‌రుణ్ తేజ్ స్వ‌యంగా త‌న పెళ్లికి సంబంధించిన ప‌లు విష‌యాల‌ని ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో తెలియ‌జేశాడు. త‌ను న‌టించిన గాండీవధారి అర్జున చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కానుండ‌గా, ప్ర‌స్తుతం మూవీ ప్ర‌మోష‌న్స లో పాల్గొంటున్నాడు.ఈ ప్ర‌మోష‌న్స్‌లో త‌న పెళ్లికి సంబంధించి అనేక విష‌యాలు తెలియ‌జేస్తున్నాడు.

తాజాగా త‌న పెళ్లి తేది, ప్లేస్ గురించి చెప్పిన వ‌రుణ్ తేజ్..  మ్యారేజ్‌ డేట్‌ ఇంకా ఫైనల్‌ కాలేదని చెప్పుకొచ్చారు. నవంబర్‌లోగానీ, డిసెంబర్‌లోగాని తమ పెళ్లి జ‌రిగ‌నే ఛాన్స్ ఉందని, అయితే త‌మ పెళ్లి తేది ఫిక్స్ చేసేది మాత్రం మా అమ్మ‌నే అని వ‌రుణ్ పేర్కొన్నాడు. ఇక మ్యారేజ్ వేదిక గురించి మాట్లాడిన వ‌రుణ్‌..  ప్రైవేట్ వెడ్డింగ్‌గా  చేసుకోవాలని అనుకుంటున్నాం. అలా చేసుకోవ‌డం హైదరాబాద్ లో సాధ్యం కాదు కాబ‌ట్టి  డెస్టినేషన్‌ వెడ్డింగ్  అనుకుంటున్నాం. ఇండియాలో మూడు ప్లేస్‌లను, విదేశాల్లో రెండు ప్రాంతాలను పరిశీలిస్తున్నామ‌ని, త్వ‌ర‌లోనే వేదిక కూడా ఫైన‌ల్ చేస్తామ‌ని ఆయ‌న అన్నారు.

పెళ్లి తేదిని బ‌ట్టి వేదిక మారే అవ‌కాశం కూడా ఉంద‌ని వ‌రుణ్ అన్నారు. ఇక లావ‌ణ్య త్రిపాఠికి ముందుగా తానే ప్ర‌పోజ్ చేసిన‌ట్టు చెప్పిన వ‌రుణ్‌.. ఇరువురం చాలా గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకున్నాం అని పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం తాను వాడుతున్న ఐఫోన్ గిఫ్ట్ లావ‌ణ్య ఇచ్చిందే అని తెలియ‌జేశాడు మెగా ప్రిన్స్.  ఇక వరుణ్‌ తేజ్ న‌టించిన  `గాంఢీవధారి అర్జున` చిత్రం ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్క‌గా, ఇందులో  వరుణ్‌కి జోడీగా సాక్షీ వైద్య హీరోయిన్‌ఘా నటిస్తుంది. ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ కానుండ‌గా, ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...