Home Film News Bigg Boss: బిగ్ బాస్ షోకి బ్రేకులు.. షోని ఆపేయాలంటూ హైకోర్ట్ నోటీసులు
Film News

Bigg Boss: బిగ్ బాస్ షోకి బ్రేకులు.. షోని ఆపేయాలంటూ హైకోర్ట్ నోటీసులు

Bigg Boss: బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో దూసుకుపోతుంది. ఇప్ప‌టికే మ‌న ద‌గ్గ‌ర ఆరు సీజ‌న్స్ తో పాటు ఒక ఓటీటీ సీజ‌న్ కూడా పూర్తి చేసుకొని ఇప్పుడు ఏడో సీజ‌న్‌తో అలరించేందుకు సిద్ధ‌మైంది. గ‌త సీజ‌న్ కాస్త నిరాశ‌ప‌ర‌చ‌డంతో ఈ ఏడాది బిగ్ బాస్ షో ఉండ‌ద‌ని అంద‌రు అనుకున్నారు. కాని ఇటీవ‌ల వ‌రుస ప్రోమోలు రిలీజ్ చేస్తూ సీజ‌న్ 7 మొద‌లు కావ‌డానికి మ‌రెంతో టైం లేద‌నే హింట్ ఇచ్చారు. ఇక బిగ్ బాస్ ప్రియులు ఎప్పుడెప్పుడు ఈ షో మొద‌ల‌వుతుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో బిగ్ బాస్ షోని ఆపేయాలంటూ హైకోర్ట్ నోటీసులు జారీ చేసి పెద్ద షాక్ ఇచ్చింది.

బిగ్ బాస్‌ షోని నిలిపివేయాలంటూ పిటిషన్‌ దాఖలైన నేపథ్యంలో హైకోర్ట్ విచారణ చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, అలాగే `స్టార్ మా`తోపాటు నాగార్జునకి కూడా నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని కూడా కోరింది. కేసుకు సంబంధించిన విచార‌ణ నాలుగు వారాల‌కి వాయిదా వేయ‌గా, ఆ లోపు ప్రభుత్వం, స్టార్‌ మా నిర్వహకుల నుంచి కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. మ‌రి కొద్ది రోజుల‌లో షో మొద‌లు కానుంద‌నుకుంటున్న స‌మ‌యంలో ఇలాంటి నోటీసులు రావ‌డంతో అంద‌రు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. అయితే గతంలోనూ బిగ్‌ బాస్‌పై ఇలాంటి పిటిషన్‌లు దాఖలయిన‌ప్ప‌టికీ షోని ఎవరూ ఆపలేకపోయారు.

 

మ‌రి ఏడో సీజ‌న్‌కి బ్రేకులు ప‌డ‌తాయా లేదంటే య‌ధావిధిగా సాగుతుందా అనేది చూడాలి. ఇక ఇదిలా ఉంటే బిగ్‍బాస్ ఆరు సీజన్లలో పాల్గొన్న స్టార్లతో ‘బిగ్‍బాస్ షైనింగ్ స్టార్స్’ పేరుతో ఓ ఎంటర్‌టైన్‍మెంట్ ఈవెంట్‍ చేస్తుంది స్టార్ మా. ఈ షోలో నాగార్జున కూడా సంద‌డి చేశారు. ఇటీవ‌ల ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుద‌లైంది. ఈ ఆదివారం (జూలై 30) సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్ ప్రసారం కానుందని స్టార్ మా వెల్లడించింది. ఈ ఈవెంట్ సుదీర్ఘంగా ఉండే అవ‌కాశం ఉండ‌గా ఇది ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌నుంద‌ని అంటున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...