Home Film News Lavanya Tripathi: బాబోయ్.. మెగా కోడ‌లు ఇంత‌లా డోస్ పెంచితే త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే..!
Film News

Lavanya Tripathi: బాబోయ్.. మెగా కోడ‌లు ఇంత‌లా డోస్ పెంచితే త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే..!

Lavanya Tripathi: మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్‌తో నిశ్చితార్థం జ‌రుపుకొని మెగా కోడ‌లిగా మారింది లావ‌ణ్య త్రిపాఠి. జూన్ 9న వీరి నిశ్చితార్థం కాగా, న‌వంబ‌ర్‌లో ఈ ఇద్ద‌రు పెళ్లి పీట‌లెక్క‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. మెగా కోడ‌లిగా ప్ర‌మోష‌న్ అందుకున్న త‌ర్వాత లావ‌ణ్య త్రిపాఠి తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. ఆమె ఏం చేసిన హాట్ టాపిక్ అవుతుంది. మొద‌టి నుండి గ్లామ‌ర్ షో విష‌యంలో కాస్త హ‌ద్దులు పెట్టుకున్న లావణ్య త్రిపాఠి ఇప్ప‌టికీ కూడా అదే పాటిస్తుంది. తాజాగా ఈ అమ్మ‌డు త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో వ‌ర్క‌వుట్ వీడియో ఒక‌టి షేర్ చేసింది. ఇందులో ఆరెంజ్ కలర్ జిమ్ సూట్‌లో క‌నిపించింది.టైట్ డ్రెస్‌లో లావ‌ణ్య క్యూట్ పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

 

లావ‌ణ్య త్రిపాఠి జిమ్ పిక్స్ చూసిన నెటిజన్స్ అదరగొట్టావ్.. లావణ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట తెగ సంద‌డి చేస్తున్నాయి. ఇక వ‌రుణ్ తేజ్ లావ‌ణ్య త్రిపాఠి ప్రేమ విష‌యానికి వ‌స్తే.. ఇద్దరూ 2017లో వచ్చిన మిస్టర్ సినిమాలో తొలిసారి కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ కోసం 2016లో ఇటలీ వెళ్లగా, ఆ స‌మ‌యంలో వారి ప్రేమకు బీజం పడినట్లు తెలుస్తోంది. సినిమాలో ఓ పాట చిత్రీకరణకు అక్కడికి వెళ్లిన వరుణ్-లావణ్యల మధ్య మొదట స్నేహం చిగురించిగా, ఆ త‌ర్వాత స్నేహం ప్రేమ‌గా మారింద‌ని అంటున్నారు. ఇటలీలో పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటున్న ఈ జంట అక్క‌డే హానీమూన్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్ గాంఢీవధారి అర్జున అనే చిత్రం చేస్తుండ‌గా, ఈ మూవీ టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌ల కాగా, ఇది సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది. శక్తి ప్రతాప్ సింగ్ హడా చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, ఇందులో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు వరుణ్.. పలాస ఫేమ్ కరుణ కుమార్‌తో మరో చిత్రాన్ని చేయ‌నున్నాడు. ఇక అందాల రాక్షసిలో తన నటనతో వావ్ అనిపించిన లావ‌ణ్య త్రిపాఠి ప‌లు తెలుగు, త‌మిళ సినిమాల‌తో బిజీగా ఉంది. అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలోను సంద‌డి చేస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...