Home Film News దేవర లో నటీనటులు వీళ్లే…ఒక్కొక్కరి బ్యాగ్రౌండ్ తెలిస్తే మతులు పోవాల్సిందే..!
Film News

దేవర లో నటీనటులు వీళ్లే…ఒక్కొక్కరి బ్యాగ్రౌండ్ తెలిస్తే మతులు పోవాల్సిందే..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో విజయాలను అందుకోవడమే కాకుండా ఆయనకి సపరేట్ గా ఒక స్టార్ డమ్ అనేది తీసుకొచ్చి పెట్టాయి. మొదట్లో ఈయన చేసిన ఆది, సింహాద్రి లాంటి సినిమాలు మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించి పెట్టాయి. ఇక ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ మూవీ పాన్ ఇండియా లెవెల్ లోనే కాకుండా ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుని ఎన్టీఆర్ క్రేజ్‌ని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లింది.

Man of Masses NTR Jr Takes Over The Internet With More Than 25 Million  Mentions On Twitter In A Year's Time - Filmibeat

త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న దేవర సినిమా మీదనే అందరి ఫోకస్ ఉంది. దీంతో ఈయనకు సంబంధించిన ప్రతి విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే విడుదల చేసిన లుక్‌లో చేతిలో ఆయుధంతో ఎన్టీఆర్ లుక్ ఫెర్రోషియస్‌గా ఉంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోన్‌గా నటిస్తోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే హాలీవుడ్ రేంజ్‌లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు.

Devara - Jr NTR-starrer's first glimpse to be out on THIS date! Check out  new poster

ఇక 2024 కొత్త యేడాది సందర్భంగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేసారు. ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ ఫెరోషియస్ లుక్‌తో పాటు ఈ సినిమా గ్లింప్స్‌ను ఈ నెల 8న విడుదల చేస్తున్నట్టు బిగ్‌ అప్డేట్ ఇచ్చారు. ఇక తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో న‌టిస్తున్న న‌టిన‌టుల గురించి ఓ క్రేజీ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో టాలీవుడ్ నూంచి బాలీవుడ్‌, వ‌ర‌కు ఎంద‌రో అగ్ర నటులు న‌టిస్తున్న‌రు.

Image

ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి చెప్పాలంటే ముఖ్యంగా టాలీవుడ్ నుంచి శ్రీకాంత్ ఈ మూవీలో ఓకీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, ప్రస్తుతం సౌత్ సినిమాల్లో విలన్ గా మంచి ఫేమస్ అయిన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, వీరే కాకుండా నారాయణ్, తారక్ పొన్నప్ప, అభిమన్యు సింగ్, కలైయరసన్, నిహాల్ కోఢాటి వంటి అగ్ర నటులు ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు.

NTR Jr's next titled Devara

ఇక దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం చూడ‌బోతున్నం అన్నీ ఈ సినిమాలో న‌టించే న‌టిన‌టుల‌ను చూస్తుంటేనే అర్థ‌మావుతుంది. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అందుకే రెండు పార్ట్‌ల్లో దేవర సినిమా వ‌స్తుంది. రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. రెండు పార్టులుగా వస్తున్న దేవర పార్ట్ 1 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...