Home Film News NTR: షూటింగ్ లో ఎన్టీఆర్ ను రక్తం వచ్చేలా కొట్టిన నటుడు ఎవరో తెలుసా?
Film News

NTR: షూటింగ్ లో ఎన్టీఆర్ ను రక్తం వచ్చేలా కొట్టిన నటుడు ఎవరో తెలుసా?

NTR: తెలుగు సినిమా చరిత్రలో నందమూరి తారక రామారావు అందరికీ సుపరిచితులే. ఆయన సినిమాలు ఎన్నో ఇప్పటికీ నేటి తరానికి కూడా  రామారావు అంటే ఎంతో అభిమానం. మరెంతో గౌరవం. సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఎన్టీఆర్ శ్రీరాముడిగా, శ్రీ కృష్ణుడిగా, రావణాసురుడిగా, దుర్యోదనుడిగా ఇలా ఏ పౌరాణిక పాత్ర వేయాలన్నా అది ఎన్టీఆర్ మాత్రమే అనేలా ఎంతో హుందాగా ఉండేది. ఇప్పుడు రాముడు, కృష్ణుడు అంటే సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే అనేలా ఆయన రూపం మాత్రమే గుర్తుకు వస్తుంది. కేవలం హీరోలే కాకుండా ఆయన ఏ పాత్రలో నటిస్తే.. ఆ పాత్రకు కచ్చితంగా న్యాయం చేస్తారు. పాత్ర ఏదైనా.. ఎంత కష్టమైనా సరే ఆ పాత్రకు నూటికి నూరు శాతం ప్రాణం పోస్తారు. అలా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు.

గొప్ప కుటుంబంలో బిడ్డగా యాక్ట్ చేయాలన్నా.. నిరుపేద కుటుంబంలోని బిడ్డగా నటించాలన్నా.. ఓ కుటుంబాన్ని నడిపే కుటుంబ పెద్దగా అయినా.. ఇలా ఒకటా రెండా ఎన్నో పాత్రల్లో నటించి.. అలరించారు. అలాంటి ఎన్టీఆర్ ను షూటింగ్ పేరుతో ఒకరు కూర్చీతో రక్తం వచ్చేలా కొట్టారట. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. పాండురంగ మహత్యం మూవీ. ఇది పూర్తి పౌరాణిక సినిమా. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పుండరీక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా నటుడు పేకేటి శివరాం ఎన్టీఆర్ ను కుర్చితో కొట్టే సీన్ ఉంది.

దీంతో ఈ సీన్ లో తాను యాక్ట్ చేయను అని తెగేసి చెప్పేశారట పేకేటి శివరాం. కానీ సినిమాల్లో ఇవన్నీ సహజమేనని.. అది కేవలం పాత్ర మాత్రమేనని ఎన్టీఆర్ గారే ఒప్పించి మరీ ఆయనతో యాక్ట్ చేపించారట. ఈ సీన్ లో పేకేటి శివరాం కొట్టడంతోనే ఎన్టీఆర్ వీపుకి దెబ్బ తగిలి రక్తం కారిందట. దీంతో పేకేటి శివరాం చాలా భయపడిపోయి షూటింగ్ ప్లేస్ నుండి పక్కకి వెళ్లిపోయి దాక్కున్నారట. దాంతో ఇవన్నీ కామన్ అని పేకేటి శివరాంతో ఎన్టీఆర్ మాట్లాడి ఆయనతో మాట్లాడి భయాన్ని తగ్గించారట.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...