Home Film News Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ప్రేమ‌తోనే రామ్ చ‌ర‌ణ్ త‌న కూతురికి అలా పేరు పెట్టాడా..!
Film News

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ప్రేమ‌తోనే రామ్ చ‌ర‌ణ్ త‌న కూతురికి అలా పేరు పెట్టాడా..!

Pawan Kalyan: గ‌త కొద్ది రోజులుగా ఎక్క‌డ చూసిన ఏ నోట విన్నా కూడా రామ్ చ‌ర‌ణ్ కూతురు పేరు గురించే. జూన్ 20న ఉపాస‌న పండంటి కూతురికి జ‌న్మ‌నివ్వ‌డంతో మెగ్రా ప్రిన్సెస్ అనే హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అయింది. ఛానెల్స్ అన్నీ కూడా ఈ విష‌యం గురించే ప్ర‌సారం చేయ‌డం, యూట్యూబ్‌ల‌లో అయితే చిన్నారికి సంబంధించి అనేక విష‌యాలు చెప్ప‌డం వంటివి చేశారు. రామ్ చరణ్, ఉపాసనల వివాహం 2012 జూన్ 24న ఘనంగా జర‌గ‌గా, పెళ్లయిన 11 ఏళ్ళకి ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వ‌డంతో ఇంత హంగామా నెలకొంది. ఇక రీసెంట్‌గా చిన్నారికి సంబంధించి బార‌సాల వేడుక నిర్వహించ‌గా, ఆ కార్య‌క్ర‌మంలో మెగా ప్రిన్సెస్ క్లింకారా కొణిదెల అనే పేరు పెట్టి ఆ పేరుని చిరు తన సోష‌ల్ మీడియా ద్వారా అంద‌రికి తెలియ‌జేశారు.

ఈ పేరు త‌న మ‌న‌వ‌రాలికి ఎందుకు పెట్టామనే అంశంపై కూడా మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. లలితా సహస్రనామం నుంచి ఈ పేరు తీసుకున్నట్టు చిరంజీవి తెలియ‌జేశారు. ఈ పేరు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగాను, ట్రెండీగాను ఉండ‌డంతో గ‌త కొద్ది రోజులుగా ఈ పేరుపై అనేక చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. అలానే కొత్త కొత్త విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.  పాప పేరు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు ఒకేలా ఉన్నాయ‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.  రామ్ చ‌ర‌ణ్‌.. త‌న బాబాయ్ పవన్ కళ్యాణ్ పై ప్రేమతో కూతురికి ఈ పేరు పెట్టినట్లు కొంద‌రు  ప్రచారం చేస్తున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ కుమార్ కొణిదెల కాగా, ఆయ‌న పేరు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సమయంలో  పవన్ కళ్యాణ్ గా మారిపోయింది. అయితే  కళ్యాణ్ కుమార్ కొణిదలని షార్ట్ క‌ట్‌లో కేకేకే అని రాస్తాం. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్‌- ఉపాస‌న‌ల కూతురు  క్లిమ్ కార కొణిదల పేరు కూడా KKK నే వస్తుంది. ఈ విధంగా  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుకు రామ్ చరణ్ కూతురు పేరుకు సంబంధం ఉంద‌ని, బాబాయ్‌పై ప్రేమ‌తోనే రామ్ చ‌ర‌ణ్ త‌న కూతురికి ఇలాంటి పేరు పెట్టాడని కొంద‌రు మెగా అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...