Home Film News Uday Kiran: చిరు కూతురితో ఉద‌య్ కిర‌ణ్ ఎప్పుడు ప్రేమ‌లో ప‌డ్డాడు.. వారిద్ద‌రి బ్రేక‌ప్‌కి కార‌ణ‌మేంటి?
Film News

Uday Kiran: చిరు కూతురితో ఉద‌య్ కిర‌ణ్ ఎప్పుడు ప్రేమ‌లో ప‌డ్డాడు.. వారిద్ద‌రి బ్రేక‌ప్‌కి కార‌ణ‌మేంటి?

Uday Kiran: ఇటీవ‌లి కాలంలో మెగా డాట‌ర్స్ విడాకుల బాట ప‌ట్డ‌డం ఇండ‌స్ట్రీ వర్గాల‌లోను చ‌ర్చ‌నీయాంశం కావ‌డం మ‌నం చూశాం. శ్రీజ మొద‌ట  శిరీష్ భ‌ర‌ద్వాజ్ అనే వ్య‌క్తిని  ప్రేమించి వివాహం చేసుకొని కొన్నాళ్ల‌కి అత‌నికి విడాకులు ఇచ్చింది. అనంత‌రం క‌ళ్యాణ్ దేవ్ అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అత‌నితోను విడాకులు తీసుకొని చిరంజీవి ఇంట్లో ఉంటున్న‌ట్టు తెలుస్తుంది. ఇక మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల కూతురు రాజ‌స్థాన్‌లో చాలా అట్ట‌హాసంగా జొన్న‌ల‌గ‌డ్డ చైతన్య‌ని పెళ్లి చేసుకుంది. ఈ అమ్మ‌డు కూడా త‌న భ‌ర్త‌కి విడాకులు ఇచ్చి సోలోగా ఉంటుంద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ప్రేమ వ్య‌వ‌హారం తెర‌పైకి వచ్చింది. ఉద‌య్ కిర‌ణ్‌ని ప్రేమించి నిశ్చితార్థం జ‌రుపుకున్న సుస్మిత అతనిని పెళ్లి ఎందుకు చేసుకోలేదని ముచ్చటించుకుంటున్నారు.

సుస్మిత‌ని క‌థానాయిక‌గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయాల‌ని చిరంజీవి అనుకున్నార‌ట‌. ఆ  సమయంలో పూరి జగన్నాథ్ ఒక మంచి సినిమా కథను రెడీ చేసి చిరంజీవి వినిపించాడు. అయితే ఫ‌స్టాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ న‌చ్చ‌ని కార‌ణంగా సినిమా ఆగిపోయింది. అయితే ఇందులో ఉదయ్ కిరణ్ హీరో కాగా, సుస్మితను హీరోయిన్ గా పెట్టాలని  భావించారు. ఈ క్ర‌మంలో వారిద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డి అది ప్రేమ‌గా మారింది. ఈ విష‌యం ఇంట్లో వాళ్ల‌కి తెలియ‌జేయ‌డంతో వారు వీరిద్ద‌రి నిశ్చితార్థం కూడా జ‌రిపించారు. కాని ఏమైందో ఏమో పెళ్లికి కొద్ది రోజుల ముందే ఉదయ్ కిరణ్ ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకొని వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

ఆ మ‌ధ్య ఓ సినీ జ‌ర్న‌లిస్టు ఉద‌య్ కిర‌ణ్ గురించి చెబుతూ.. ఇంద్ర సినిమా శ‌త‌దినోత్స‌వ వేడుకుల‌కు ఉద‌య్ కిర‌ణ్‌ హాజ‌రైన‌ప్పుడే  వీరిద్ద‌రి పెళ్లి జ‌రుగుతుంద‌ని అంద‌రు అనుకున్నార‌ట‌.. చిరు కూతురుతో పెళ్లి కుదిరిన వెంట‌నే ఉద‌య్ కిర‌ణ్ జ‌ర్న‌లిస్టు మిత్రుల‌కు పార్టీ కూడా ఇచ్చాడ‌ట‌.కాని  ఓ మ‌హిళా జ‌ర్న‌లిస్టుతో ప్రేమాయ‌ణం వ‌ల్లే ఉద‌య్ కిర‌ణ్ – సుస్మిత పెళ్లి ఆగిపోయింద‌న్న రూమ‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ట‌. ఆ త‌ర్వాత మెగా ఫ్యామిలీయే ఉద‌య్‌ను తొక్కేసింద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. దీనికి తోడు ఉద‌య్ కిర‌న్ న‌టించిన సినిమాలు అన్నీ వ‌రుస‌గా ప్లాప్ కావ‌డంతో ఉద‌య్ కిర‌ణ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని అన్నారు. కాని ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియ‌దు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...