Home Film News Samantha Health: అమెరికాలో స‌మంత‌కి చికిత్స‌… ప‌రోక్షంగా చెప్పిన హెయిర్ స్టైలిస్ట్
Film News

Samantha Health: అమెరికాలో స‌మంత‌కి చికిత్స‌… ప‌రోక్షంగా చెప్పిన హెయిర్ స్టైలిస్ట్

Samantha Health: అందాల ముద్దుగుమ్మ స‌మంత గ‌త కొద్ది రోజులుగా క‌ఠిన ప‌రీక్ష‌లు ఎదుర్కొంటున్న విషయం విదిత‌మే. ఆరోగ్యం విష‌యంలో స‌మంత‌కి  ప‌లు స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. మ‌యోసైటిస్ బారిన ప‌డిన స‌మంత కొన్నాళ్ల పాటు సినిమాల‌కి దూరంగా ఉండి చికిత్స తీసుకుంది. కోలుకున్న త‌ర్వాత తాను ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసింది. ఇక ఇప్పుడు ఏడాది పాటు సినిమాల‌కి బ్రేక్ ఇవ్వ‌బోతున్న‌ట్టు స్ప‌ష్టం చేసింది. చికిత్స కోస‌మే ఆమె ఇలా బ్రేక్ ఇచ్చింద‌ని, త్వ‌ర‌లో అమెరికా వెళుతున్నారనే ప్రచారం కూడా జ‌రిగింది.. అయితే దీనిపై అధికారిక సమాచారం లేకపోవడంతో అభిమానుల‌లో ప‌లు సందేహాలు నెల‌కొన్నాయి.

అయితే స‌మంత‌కి అమెరికాలో చికిత్స జ‌ర‌గ‌నుందనే విష‌యాన్ని ఆమె  మిత్రుడు రోహిత్ బత్కర్  పరోక్షంగా తెలియజేశాడు. రోహిత్ బత్కర్ సెలెబ్రిటీ హెయిర్ స్టైలిష్ట్ కాగా,అత‌ను  కొన్నాళ్లుగా ఆమె వ‌ద్ద పని చేస్తున్నాడు.  వారిద్ద‌రి మ‌ధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. అయితే తాజాగా అత‌ను త‌న సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. అందులో  ఆ దేవుడు మీకు  శక్తి, మనోధైర్యం ప్రసాదించాలి. పూర్తి ఆరోగ్యంగా సమంత కోలుకోవాలంటూ కామెంట్ చేశాడు. దీంతో స‌మంత చికిత్స కోసం అమెరికాకి వెళ్ల‌నుంద‌ని అభిమానుల‌కి ఓ కార్లిటీ వ‌చ్చింది. మెరుగైన చికిత్స కోస‌మే స‌మంత అక్క‌డికి వెళుతుంద‌ని భావిస్తున్నారు.

చికిత్స కోసం  స‌మంత చాలా రోజుల పాటు అమెరికాలోనే ఉంటుంద‌ని టాక్. ఇక సమంత వైద్యానికి కోటి రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని  వినికిడి.ఇక స‌మంత సినిమాల విష‌యానికి వ‌స్తే   విజయ్ దేవరకొండకు జంటగా ఖుషీ అనే చిత్రం చేయ‌గా, ఈ మూవీ  సెప్టెంబర్ 1న విడుదల కానుంది. దర్శకుడు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో  రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రూపొందింది. స‌మంత న‌టించిన‌ సిటాడెల్  వెబ్ సిరీస్ ప్ర‌స్తుం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకోనుంది. అతి త్వ‌ర‌లోనే ఇది  అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఇందులో స‌మంత‌, వ‌రుణ్ ధావ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌గా, రాజ్ అండ్ డీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...