Home Film News Star Heroine: అంత స్టార్ హీరోయిన్ అయి ఉండి, ఫొటోగ్రాఫ‌ర్ చెప్పులు చేతితో ప‌ట్టుకుందేంటి..!
Film News

Star Heroine: అంత స్టార్ హీరోయిన్ అయి ఉండి, ఫొటోగ్రాఫ‌ర్ చెప్పులు చేతితో ప‌ట్టుకుందేంటి..!

Star Heroine: కొన్ని సార్లు సెలబ్రిటీలు చేసే ప‌నులు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి. తాజాగా ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భ‌ట్ ఓ ఫోటోగ్రాఫ‌ర్ చెప్పుని చేతితో ప‌ట్టుకొని ఆయ‌న‌కి అందించ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. వివరాల‌లోకి వెళితే సాధార‌ణంగా అలియా భ‌ట్ ఎక్క‌డ ఉంటే అక్క‌డ ఫొటోగ్రాఫ‌ర్స్ ప్ర‌త్య‌క్షం కావ‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. అలియా బ‌య‌ట‌కి వ‌స్తే ఆమెని తమ కెమెరాల‌లో బంధించేందుకు వారు చాలా ఆస‌క్తి చూపుతుంటారు. రీసెంట్‌గా అలియా ముంబైలోని ఒక ఏరియాకి వెళ్ల‌గా, ఆమెని  ఫోటోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్స్ ఉత్సాహపడ్డారు.అయితే  అలియా కూడా వారి కోసం కొన్ని ఫోటోలకి పోజులు ఇచ్చింది

అలియా ఫోటోలు తీసే కంగారులో ఒక ఫొటోగ్రాఫ‌ర్ కాలి చెప్పు ప‌క్క‌న ప‌డిపోగా, అది చూసిన అలియా భ‌ట్ త‌న చేతితో ఆ చెప్పుని తీసుకొని అత‌ని ద‌గ్గ‌ర‌కి వెళ్లి ఇచ్చింది. అలియా చేసిన ప‌నికి అంద‌రు షాక్ అవుతున్నారు. అంత స్టార్ హీరోయిన్ అయి ఉండి ఫొటోగ్రాఫ‌ర్ చెప్పు అలా చేతితో ప‌ట్టుకొని వెళ్ల‌డ నిజంగా గ్రేట్ అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం అలియా చేసిన ప‌నిపై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. ఆమెని  మెచ్చుకుంటూ తెగ‌ కామెంట్లు పెడుతున్నారు.  కాగా, అలియా భ‌ట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్ర‌లో క‌నిపించి ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచింది.

ఆర్ఆర్ఆర్ సినిమాతో  తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయిన ఈ భామ బ్రహ్మాస్త్ర  చిత్రంతో అలరించింది. ఈ  సినిమాని తెలుగులో కూడా రిలీజ్  చేయ‌డంతో ఇక్క‌డి ప్రేక్ష‌కులు బాగానే ఆద‌ర‌ణ చూపించారు. ఇక‌ రణ్ బీర్ క‌పూర్‌ని పెళ్లి చేసుకొని పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన అలియా భ‌ట్‌.. పాప బాగోగులు చూసుకుంటూనే సినిమాల‌తో బిజీగా ఉంటుంది. అప్పుడ‌ప్పుడు  సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫోటో షూట్లతో  సందడి చేస్తూ ర‌చ్చ చేస్తుంటుంది.ఇక అలియా న‌టించిన‌ హాలీవుడ్ మూవీ, ఓ బాలీవుడ్ మూవీ విడుద‌లకి సిద్ధంగా ఉన్నాయి.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...