Home Film News Pawan Kalyan: మ‌రోసారి ప్ర‌భాస్ అభిమానుల మ‌న‌సు గెలుచుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!
Film News

Pawan Kalyan: మ‌రోసారి ప్ర‌భాస్ అభిమానుల మ‌న‌సు గెలుచుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!

Pawan Kalyan: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహి యాత్ర ఉభ‌య గోదావ‌రి జిల్లాలలో కొద్ది రోజులుగా సాగుతున్న విష‌యం తెలిసిందే. జూన్ 30న భీమ‌వ‌రంలో భారీ ఎత్తున స‌భ ఏర్పాటు చేశారు. ఈ స‌భ‌కి పెద్ద ఎత్తున అభిమానులు, ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చారు. ఈ కార్యక్ర‌మంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ రానున్న ఎల‌క్ష‌న్స్‌లో త‌మ పార్టీని గెలిపించాల‌ని, అంద‌రికి చేదోడువాడుగా ఉంటామ‌ని అన్నారు. అలానే వైసీపీ ప్ర‌భుత్వం చేస్తున్న అరాచ‌కాలు, అవినీతిని ప్ర‌శ్నించారు జ‌న‌సేనాని. వారాహి యాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న అభిమానుల‌నే కాక ఇత‌ర హీరోల అభిమానుల దృష్టిని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

ఇటీవ‌ల జ‌రిగిన స‌భ‌లో త‌న కన్నా కూడా  మహేష్ బాబు, ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్ పెద్ద హీరోలని.. వారికి ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంద‌ని, అది త‌న‌కు లేద‌ని చెప్పుకొచ్చారు. అంతే కాదు మ‌హేష్‌, ప్ర‌భాస్ లాంటి వారు త‌న క‌న్నా ఎక్కువ రెమ్యున‌రేష‌న్ కూడా తీసుకుంటార‌ని పవన్ అన్నారు. ఇక భీమవ‌రం స‌భ‌లో మాట్లాడిన ప‌వ‌న్..  ఇక్క‌డ ప్ర‌భాస్ అభిమానులు ఎక్కువ‌. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేష్ , అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మీ అంద‌రి స‌పోర్ట్ నాకు కావాలి. నాది జ‌న‌సేన పార్టీ. ఈ పార్టీ ద్వారా అంద‌రు హీరోల అభిమానుల‌కి మంచి చేయాల‌ని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు.

అలానే 2015 సంవ‌త్సరంలో  పోస్ట‌ర్ విష‌యంలో ప్రభాస్, పవన్ ఫ్యాన్స్ మధ్య జ‌రిగిన పెద్ద గొడ‌వ గురించి కూడా ప్ర‌స్తావించారు. అప్పుడు జ‌రిగిన ఆ సంఘ‌ట‌న నాకు చాలా బాధ క‌లిగించింది. ఎవ‌రు పోస్ట‌ర్ చించిన క్ష‌మించి వ‌ద‌లాలి. లేని పోని గొడ‌వ‌లు పెట్టుకోవ‌ద్దు. చిన్న సంఘ‌ట‌ల‌ని పెద్ద‌వి చేయ‌కండి, మీ అంద‌రికి రెండు చేతులెత్తి వేడుకుంటున్నా అని ప‌వన్ స్ప‌ష్టం చేశారు.  ప‌వ‌న్ మాట్లాడిన‌ మాటలు ప్రభాస్ అభిమానుల హృదయాల్ని గెలుచుకునేలా ఉన్నాయని  కొంద‌రు చెప్పుకొస్తున్నారు. గ‌త ఎల‌క్ష‌న్స్ లో  భీమవరం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ఈ సారి త‌న స్థానంలో ఎవ‌రిని నిలుచోపెడ‌తాడో చూడాలి.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...