Home Film News Anushka: అనుష్క అభిమానులకి గుడ్ న్యూస్.. త్వ‌ర‌లో మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు జేజ‌మ్మ‌
Film News

Anushka: అనుష్క అభిమానులకి గుడ్ న్యూస్.. త్వ‌ర‌లో మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు జేజ‌మ్మ‌

Anushka: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు అరుంధ‌తి చిత్రంలో జేజ‌మ్మ‌గా, బాహుబలిలో దేవ‌సేన‌గా న‌టించి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుంది.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున  హీరోగా నటించిన సూపర్ చిత్రం ద్వారా  సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టింది అనుష్క‌. ఈ అమ్మ‌డు ఒక‌వైపు హీరోల స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తూనే మ‌రోవైపు లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌లో న‌టిస్తూ స‌త్తా చాటుతూ వ‌చ్చింది. ఒక‌ప్పుడు వ‌రుస సినిమాలు చేస్తూ వ‌చ్చిన అనుష్క ఇప్పుడు  40 ఏళ్ల వయసుకు చేరుకోవడం, యంగ్ హీరోయిన్లతో విపరీతమైన పోటీ ఉండ‌డం వ‌ల‌న కాస్త సినిమాలు త‌గ్గించింది.

చివ‌రిగా  ‘నిశ్శబ్దం’ అనే చిత్రంలో నటించిన అనుష్క త‌దుప‌రి సినిమా చేసేందుకు చాలా టైం తీసుకుంది. ప్ర‌స్తుతం  జాతిరత్నం ఫేం నవీన్ పోలిశెట్టి హీరోగా, అనుష్క క‌థాయిక‌గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే చిత్రం రూపొందుతుంది. ఇందులో అనుష్క పాత్ర చాలా కొత్త‌గా ఉంటుంద‌ని అంటున్నారు. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించి విడుద‌లైన టీజ‌ర్, సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.  చిత్రానికి రాధన్ సంగీతం అందిస్తుండగా యువీ క్రియేషన్స్ సంస్థ పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని అనుష్క అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం చిత్రాన్ని  ఆగష్టు 4 న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న అయితే రాలేదు, కాని ఇదే టైంలో రిలీజ్ చేస్తార‌ని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ చిత్రంలో  నటి జయసుధ అనుష్క తల్లి పాత్రలో నటిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోఒకే సారి చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. మూవీ అయితే ఒక‌ చెఫ్, ఒక స్టాండప్ కమెడియన్ మధ్య సాగే కథగాఉంటుంద‌ని అనుకుంటున్నారు.   రవళి పాత్రలో  అనుష్క ప్రొఫెషనల్ చెఫ్ గా క‌నిపించి అల‌రించ‌నుంది. మంచి మెసేజ్‌తో పాటు కామెడీ కూడా ఈ చిత్రంలో ఉండ‌నుంద‌ని అంటున్నారు. మూవీ కోసం అయితే అనుష్క ఫ్యాన్స్ చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

ఇప్పటికీ జక్కన్న నాకు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.. తమన్నాసెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

మిల్కీ బ్యూటీ తమన్నా చిత్ర పరిశ్రమలో ఈ పేరుకి ఎలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో...

1000 కోట్లు ఇచ్చినా సరే అలా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

ప్రస్తుతం ఇండియన్ సినిమా చిత్ర పరిశ్రమలో భారీ స్టార్‌డంతో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి వయసు దాటుతున్న...

మహేష్ కోసం అవతార్ డైరెక్టర్ ను తీసుకొస్తున్న రాజమౌళి.. జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే అధికార...

రామ్ చరణ్ ఫోన్ లో ఎన్టీఆర్ నెంబర్ ఏమని ఉంటుందో తెలుసా.. భ‌లే సిల్లిగా లేదు..!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా...