Home Film News Rashmi-Sudheer: ర‌ష్మీకి పెద్ద బిస్కెట్ ఇచ్చిన సుధీర్.. వైర‌ల్‌గా మారిన జ‌బ‌ర్ధ‌స్త్ యాంకర్ కామెంట్స్
Film News

Rashmi-Sudheer: ర‌ష్మీకి పెద్ద బిస్కెట్ ఇచ్చిన సుధీర్.. వైర‌ల్‌గా మారిన జ‌బ‌ర్ధ‌స్త్ యాంకర్ కామెంట్స్

Rashmi-Sudheer: బుల్లితెర కామెడీ షో జబ‌ర్ధ‌స్త్‌తో మంచి పాపులారిటీ ద‌క్కించుకున్న వారిలో సుడిగాలి సుధీర్, ర‌ష్మీ ఉన్నారు. వీరిద్ద‌రి కాంబో అనేక కార్య‌క్ర‌మాల‌కి మంచి రేటింగ్ తెచ్చిపెట్టింది. ఎన్నో అవ‌స్థ‌లు ప‌డ్డ సుడిగాలి సుధీర్ ఇప్పుడు టాప్ రేంజ్‌లో ఉన్నాడు. వ‌రుస సినిమాలు చేస్తూ టాప్ హీరో రేంజ్‌కి వెళ్లాల‌ని క‌ల‌లు కంటున్నాడు. మ‌రోవైపు ర‌ష్మీ కూడా ప్ర‌స్తుతం చాలా బిజీగా ఉంది. వ‌రుస టీవీ షోల‌తో పాటు వీలున్న‌ప్పుడ‌ల్లా సినిమాలు చేస్తుంది. అయితే ఒక‌ప్పుడు వీరిద్దరు క‌లిసి బుల్లితెర‌పై క‌నిపిస్తే ప్ర‌తి ఒక్క‌రు తెగ ఎంజాయ్ చేసేవారు. కాని ఇటీవ‌లి కాలంలో వీరిద్ద‌రు క‌లిసి ఒక్క షో  కూడా చేసింది లేదు.

సుడిగాలి సుధీర్, ర‌ష్మీ జంట‌గా షోస్ చేయ‌క‌పోయిన ప‌ర్లేదు కాని రియ‌ల్ లైఫ్‌లో ఒక్క‌టైతే బాగుండు అని మ‌రి కొంద‌రు అనుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు  సుధీర్‌ పెళ్లి వార్త ఒక‌టి  నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.   సుధీర్, యాంకర్  రష్మితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని పెళ్లి చేసుకోనున్నాడ‌ని ఎన్నో రూమర్స్‌ వచ్చినా.. అవి కేవలం పుకార్లే అని, తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని ఇద్ద‌రు ప‌లుమార్లు  క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయిన‌ కూడా ఇప్పటికీ వీళ్లకు సంబంధించిన వార్తలు వస్తునే ఉంటున్నాయి. ఆ మ‌ధ్య వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠిలు కూడా ఫ్రెండ్స్ అని ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.

ఇప్పుడు ర‌ష్మీ- సుధీర్ కూడా అలానే చేసుకుంటారేమో అని అనుకున్నారు. కాని సుడిగాలి సుధీర్ సైలెంట్‌గా తన సొంత మరదలిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్ప‌టికే వారికి సంబంధించిన నిశ్చితార్థం కూడా ముగిసింద‌ని అంటున్నారు.  సుధీర్ పెళ్లిది ల‌వ్ మ్యారేజ్ కాద‌ని,  కుటుంబ సభ్యులు ఫిక్స్ చేశారని త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంద‌ని చెబుతున్నారు. సుధీర్ పెళ్లి కుదిరింద‌ని వార్త‌లు వ‌సున్న నేప‌థ్యంలో ర‌ష్మీ గ‌తంలో చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. మా ఇద్దరి మధ్య ఎలాంటి బంధం అయినా ఉండొచ్చు. అందరికీ వివరించలేం. కొన్ని విషయాలు నేను సీక్రెట్ గా ఉంచాలి. నాలోనే దాచుకోవాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం మేమిద్దరం ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంటామో ఆన్ స్క్రీన్ పై కూడా అదే కనిపిస్తుంది అని ర‌ష్మీ అప్ప‌ట్లో కామెంట్ చేసింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...