Home Film News Babloo: అంత ఫేమ‌స్ అయిన క‌మెడీయ‌న్ బ‌బ్లు అర్ధాంత‌రంగా సినిమాలు మానేయ‌డానికి కార‌ణం?
Film News

Babloo: అంత ఫేమ‌స్ అయిన క‌మెడీయ‌న్ బ‌బ్లు అర్ధాంత‌రంగా సినిమాలు మానేయ‌డానికి కార‌ణం?

Babloo: టాలీవుడ్‌లో చాలా మంది క‌మెడీయ‌న్స త‌మ  న‌ట‌న‌తో ఎంత‌గా అల‌రించారో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. కొంద‌రికైతే ఒకే ఒక్క సినిమాతో మంచి గుర్తింపు వ‌చ్చిన సంద‌ర్భం కూడా ఉంది. అయితే మంచి అవ‌కాశాలు వ‌చ్చిన కూడా కొంద‌రు అనుకోని ప‌రిస్థితుల వ‌ల‌న కెరియ‌ర్‌కి బ్రేక్ ఇచ్చిన ప‌రిస్థితులు అనేకం. అయితే  చేసిన కొన్ని సినిమాల తోనే ప్రేక్షకుల్లో మంచి ముద్ర వేసుకున్న కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు బబ్లు. తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన బబ్లు తొలి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న‌ప్ప‌టికీ దానిని కొన‌సాగించ‌లేక‌పోయాడు.

బ‌బ్లు టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన చాలా మంది  స్టార్ హీరోల సినిమాల్లో నటించాడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా ప్రతి ఒక్కరి సినిమాలో త‌న‌దైన పాత్ర పోషించి మెప్పించాడు. ఈ క‌మెడీయ‌న్ త‌న‌ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులు అందరి  పొట్ట చెక్కలయ్యేలా నవ్వించగ‌లడు. త‌క్కువ టైంలోనే  స్టార్ హీరోల సినిమాల్లో కనిపించడంతో అందరికీ గుర్తుండిపోయాడు. అయితే రాను రాను బ‌బ్లూకి అవ‌కాశాలు త‌గ్గాయి. దాంతో సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయాడు. ఇండ‌స్ట్రీకి దూర‌మైన వారు అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో ఏదో ర‌కంగా  సంద‌డి చేస్తుంటారు.

అయితే బ‌బ్లూ మాత్రం పెద్ద‌గా సంద‌డి చేసిన‌ట్టు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. అయితే కొద్ది రోజులు కింద‌ట  ఓ ఇంటర్వ్యూలో బబ్లు తన పర్సనల్ లైఫ్ కి  సంబంధించిన కొన్ని విషయాలు చెప్పుకొచ్చి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. బబ్లు కెరియర్ పీక్ రేంజ్ లో కొనసాగుతున్న సమయంలోనే అతనికి ఎంతో ఇష్టమైన తండ్రి  కన్నుమూసార‌ట‌. అప్పటినుంచి బబ్లు జీవితం పూర్తిగా మారింద‌ని,  చాలా కాలం వరకు ఏ సినిమాని ఆయన ఒప్పుకోలేదు అని అన్నారు. ఇక ఆ క్ర‌మంలోనే త‌న‌ కెరియర్ లో గ్యాప్ వచ్చిందని బబ్లు చెప్పుకొచ్చాడు  ఆ తర్వాత అవకాశాల కోసం ట్రై చేసిన రాలేదు అని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు బ‌బ్లూ. అయితే మంచి టాలెంట్ ఉన్న బ‌బ్లూ ఇలా ఇండస్ట్రీకి దూరం కావ‌డం అభిమానుల‌ని అయితే చాలా బాధించింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...