Home Film News Baby Actress: బేబి న‌టికి అత్యాచార బెదిరింపులు.. ఇంటి అడ్రెస్ కూడా వెతుకుతున్నారంటూ ఆవేద‌న‌
Film News

Baby Actress: బేబి న‌టికి అత్యాచార బెదిరింపులు.. ఇంటి అడ్రెస్ కూడా వెతుకుతున్నారంటూ ఆవేద‌న‌

Baby Actress: ఇటీవ‌ల అంద‌రి నోళ్ల‌లో నానుతున్న చిత్రం బేబి. చిన్న సినిమాగా విడుద‌లై పెద్ద విజ‌యం సాధించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్లు రాబ‌డుతుంది. ఈ మూవీ వ‌రుస స‌క్సెస్ మీట్‌లు జ‌రుపుకుంటూ అందరి దృష్టిని ఆక‌ర్షిస్తుంటుంది. ఇక చిత్రంలో ప‌ని చేసిన న‌టీన‌టులు కూడా ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో మూవీకి సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర విశేషాలు తెలియ‌జేస్తున్నారు. బేబి  చిత్రంలో  నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో.. హీరోయిన్‌ వైష్ణవి ఫ్రెండ్‌ గా నటించిన కిర్రాక్ సీత గురించి  ఓ విష‌యం ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. చిత్రంలో సీతని  వైష్ణవి చెడ్డ దారిలో  ప‌యనించ‌డానికి కార‌ణం అన్న‌ట్టుగా చూపించారు.  దాంతో నిజ జీవితంలో కూడా ఆమె అలానే ఉంటుంద‌ని సోష‌ల్ మీడియాలో దారుణ‌మైన ట్రోల్ చేస్తున్నార‌ట‌.

రీసెంట్‌గా కిర్రాక్ సీత ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌గా, ఆ ఇంట‌ర్వ్యూలో తాను  ఓ ఈవెంట్‌కు వెళ్లి వ‌స్తుండ‌గా కొంద‌రు అబ్బాయిలు త‌న‌ను అనుస‌రించార‌ని చెప్పుకొచ్చింది. ఈ విష‌యం గురించి  స్నేహితుల‌కు ఫోన్ చేసి చెప్ప‌గా, వారు  లీసుల‌కు ఫిర్యాదు చేయ‌మ‌ని స‌ల‌హా ఇచ్చార‌ని పేర్కొంది. కాని నేను అలా చేయ‌లేదు. మ‌రి కొంద‌రు అయితే  అత్యాచారం చేస్తాం, చంపేస్తామ‌ని బెదిరించార‌ని, మ‌రికొంద‌రు త‌న‌ అడ్ర‌స్ తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారని కూడా చెప్పుకొచ్చింది. అయితే వీటిని తాను పెద్ద‌గా ప‌ట్టించుకోను అని చెప్పిన సీత‌… నా రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్ ఎంటో వారికి తెలియ‌దు కాబ‌ట్టే వారు అలా ప్ర‌వ‌ర్తించి ఉంటార‌ని పేర్కొంది.

రీల్ లైఫ్‌, రియ‌ల్ లైఫ్ కు మ‌ధ్య చాలా వ్య‌త్సాసం ఉంటుంద‌ని చెప్పిన స‌త్య‌…. ప్రేక్ష‌కులు రీల్ లైఫ్, రియల్ లైఫ్ ల మధ్య తేడాను గుర్తించలేకపోవడం దురదృష్టకరమ‌ని పేర్కొంది..  అయితే ‘బేబీ’ సినిమాలో త‌న క్యారెక్ట‌రైజేష‌న్ వ‌ల్ల‌ ఇలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ద‌ర్శ‌కుడు సాయి రాజేశ్  ముందుగానే త‌న‌కి చెప్పార‌ని స‌త్య స్ప‌ష్టం చేసింది. ఈమె గ‌తంలో  యూట్యూబ‌ర్ స‌ర‌యుతో క‌లిసి ప‌ని చేసింది. త‌ర్వాత ఆమె నుండి దూరంగా వ‌చ్చేసి ఇప్పుడు సినిమాల్లో బోల్డ్ త‌ర‌హా పాత్ర‌ల్లో న‌టిస్తూ గుర్తింపు తెచ్చుకుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...