Home Film News Anasuya: అన‌సూయ‌లో స‌డెన్‌గా ఇంత మార్పు ఏంటి.. అందరిలో ఆశ్చ‌ర్యం..!
Film News

Anasuya: అన‌సూయ‌లో స‌డెన్‌గా ఇంత మార్పు ఏంటి.. అందరిలో ఆశ్చ‌ర్యం..!

Anasuya: జ‌బ‌ర్ధ‌స్త్ షోతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన అందాల అన‌సూయ చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అని చెప్పాలి. త‌న గురించి, త‌న ఫ్యామిలీ గురించి ఎవ‌రైన ఒక్క మాట అన్నా కూడా వెంట‌నే ఇచ్చి ప‌డేస్తుంది. గ‌త కొంత కాలంగా వివాదాల‌తోనే ఎక్కువగా వార్త‌ల‌లో నిలిచిన అన‌సూయ ఇటీవ‌ల మ‌న‌శ్శాంతి కోసం తాను వివాదాల జోలికి పోద‌ల‌చుకోవ‌డం లేద‌ని చెప్పుకొచ్చింది. గ‌త కొద్ది రోజులుగా ఫారెన్ టూర్‌తో బిజీగా ఉన్న అన‌సూయ రీసెంట్‌గా త‌న ఇన్‌స్టాలో కొన్ని పిక్స్ షేర్ చేస్తూ.. నువ్వు వెనుకకు వెళ్లి ప్రారంభాన్ని మార్చలేవు.. కానీ నువ్వు ఇప్పుడు నీ ముగింపును మార్చుకోవచ్చు.. అంటూ ఓ కొటేష‌న్ రాసుకొచ్చింది. ఇది చూసిన అంద‌రు విజయ్ దేవరకొండతో సుదీర్ఘ కాలం పోట్లాడిన త‌ర్వాతే ఆ మార్పు వచ్చింది అంటున్నారు.

కాగా, కొంత కాలంగా సోషల్ మీడియా లో ఆంటీ అనే వివాదం, ది విజయ్ దేవరకొండ అనే వివాదాల్లో అనసూయ పేరు హైలైట్ అయింది. ఇప్పుడు వాట‌న్నింటికి ముంగిపు ప‌లుకుతున్న‌ట్టు అన‌సూయ హింట్ ఇచ్చింది. త‌న‌పై వచ్చిన వివాదాలను వెనక్కి వెళ్లి మార్చుకోలేదు.. కాబట్టి.. ఇప్పుడు అలాంటి వివాదాస్పద విషయాల్లో అనసూయ జోక్యం చేసుకోకుండా ఉండాల‌నే అర్ధం వచ్చేలా అన‌సూయ పోస్టు పెట్టిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అన‌సూయ గ్లామ‌ర్ షో విష‌యంలో కూడా కొన్ని మార్పులు వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది.

 

ఇటీవ‌లి కాలంలో అనసూయ‌ పోస్ట్ చేసిన ఫోటోలు గమనిస్తే కొంచెం గ్లామర్ డోస్ తగ్గించినట్లు అర్ధ‌మ‌వుతుంది.ఇది కూడా అనసూయ లో వచ్చిన మార్పులు వ‌ల్ల‌నే అని అంటున్నారు. ఇక యాంక‌రింగ్‌కి గుడ్ బై చెప్పిన అన‌సూయ ప్ర‌స్తుతం న‌టిగా ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఒకే తరహా పాత్రలకు కూడా వెరైటీ పాత్ర‌ల‌లో అనసూయ పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నారు. ఇటీవల ఆమె నటించిన విమానం పాజిటివ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ కాలేదు. ఇప్పుడు అన‌సూయ వూల్ఫ్ అనే సినిమా చేస్తుండగా, ఇందులో కూడా గ్లామ‌ర్ మోత మోగించ‌నుంద‌ని అర్ధ‌మ‌వుతుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...