Home Film News Abbas: ఆ స్టార్ హీరోకి ప‌క్ష‌వాతం వ‌చ్చే ఛాన్స్ ఉంది.. అబ్బాస్ చెప్పిన మాట‌ల‌కి ఫ్యాన్స్ షాక్
Film News

Abbas: ఆ స్టార్ హీరోకి ప‌క్ష‌వాతం వ‌చ్చే ఛాన్స్ ఉంది.. అబ్బాస్ చెప్పిన మాట‌ల‌కి ఫ్యాన్స్ షాక్

Abbas: త‌మిళ హీరో అబ్బాస్ గురించి ఈ నాటి త‌రం వారికి పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు కాని 90ల‌లో మాత్రం ఆయ‌న‌కి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రేమ దేశం అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అబ్బాస్ ఆ తర్వాత వరుసగా తమిళ్, తెలుగు, మలయాళం సినిమాలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన అబ్బాస్.. 2015 నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఫారిన్ వెళ్ళిపోయి అక్క‌డే సెటిల్ అయ్యాడు. ఫారెన్ వెళ్లాక తాను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో తెలియ‌జేశాడు.

రీసెంట్‌గా అబ్బాస్ చెన్నైకి రావ‌డంతో తమిళ యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ.. త‌న జీవితంలో జ‌రిగిన అనేక విష‌యాల గురించి ఓపెన్ అవుతున్నాడు. విశాల్‌కి త‌న‌కి ఓ సంద‌ర్భంలో వివాదం జ‌రిగింద‌ని చెప్పారు అబ్బాస్.. సినిమా ఇండ‌స్ట్రీ అంతా ఒక‌టే అని చెప్ప‌డానికి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రారంభించారు. ఆ లీగ్ సెకండ్ సీజన్ లో నాకు విశాల్ కి మధ్య కొన్ని మనస్పర్థలు రాగా, ఆయ‌న అన్న మాటలకు బాధపడి ఆ లీగ్ నుంచి తప్పుకున్నాను. అప్పుడు నా గురించి త‌ప్పుగా చెప్పాడు. ఆ నాటి నుండి విశాల్ తో నాకున్న బంధం తెగిపోయింది.ఆయ‌న ఎదురు ప‌డిన హాయ్ అని చెబుతానే త‌ప్ప ఇంతక ముందులా మాట్లాడ‌లేను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు అబ్బాస్.

 

ఇక దళపతి విజయ్ మృదుస్వభావి అని.. ఇప్పటికీ డౌన్ టు ఎర్త్గా ఉంటార‌ని చెప్పుకొచ్చారు. ఏ నాడు అతి చేయడని.. మంచి హాస్యం కలవాడని ప్ర‌శంసించారు. ఇక సూర్య‌కి సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్ర‌త్తలు తీసుకుంటార‌ని.. ఆయనకు పనిపై ఉన్న చిత్తశుద్ధి గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు అబ్బాస్. అజిత్‌కి మంచి వ్యక్తిత్వం ఉందన్నారు అబ్బాస్. అజిత్ ఏ విషయంపై అయినా మాట్లాడితే సూటిగా ప్రతిస్పందిస్తాడని చెప్పిన అబ్బాస్.. మూర్ఖత్వాన్ని అస్సలు సహించడు. అజిత్కు ఇప్పటికే చాలా సర్జరీలు జరిగాయి. పక్షవాతం వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్లు హెచ్చరించినా కూడా ఫ్యాన్స్ కోసం ఎన్నో సినిమాలు చేస్తున్నాడు. అభిమానుల ప్రేమ వ‌ల‌న ఆయ‌న కెరీర్ అద్భుతంగా సాగుతుందని అబ్బాస్ స్ట‌న్నింగ్ కామెంట్స్ చేశారు.

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...