Home Film News Baby Movie: క‌మిట్‌మెంట్ ఇస్తేనే అవ‌కాశాలు.. గెస్ట్ హౌజ్‌కి రమ్మ‌ని పిలిచారంటూ బేబి న‌టి షాకింగ్ కామెంట్స్
Film News

Baby Movie: క‌మిట్‌మెంట్ ఇస్తేనే అవ‌కాశాలు.. గెస్ట్ హౌజ్‌కి రమ్మ‌ని పిలిచారంటూ బేబి న‌టి షాకింగ్ కామెంట్స్

Baby Movie: సినిమా ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ ఏ రేంజ్‌లో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. అవ‌కాశాల కోసం న‌టీమ‌ణుల‌ని లైంగికంగా వేధించ‌డం కొన్నాళ్లుగా చూస్తున్నాం. ఒక‌ప్పుడు వీటిపై ఎవ‌రు అంత ఓపెన్ అయ్యేవారు కాదు. కాని ఇప్పుడు నటీమ‌ణులు మాత్రం మీడియా ముందుకు వ‌చ్చేసి త‌మ‌కి ఎదురైన విచిత్ర ప‌రిస్థితుల గురించి నిర్భయంగా చెప్పుకొస్తున్నారు. తాజాగా బేబి న‌టి పరిశ్రమ కి వచ్చిన కొత్తలో ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయో ఓపెన్‌గా చెప్పుకొచ్చింది. నన్ను నేను నిరూపించుకునే క్ర‌మంలో అవ‌కాశాల కోసం తిరిగాను. ఆ స‌మ‌యంలో కొంద‌రు నిర్మాతల నుంచి డైరెక్టర్స్ నుండి వ‌ల్గ‌ర్ మాట‌లు విన్నాను.

 

కొంద‌రు అయితే క‌మిట్‌మెంట్ ఇవ్వ‌మని అడిగారు. మ‌రి కొంద‌రు గెస్ట్ హౌజ్‌కి ర‌మ్మ‌ని పిలిచారు. కాని అవ‌న్నీ దాటుకొని ఇక్క‌డి వ‌ర‌కు వ‌చ్చాను. టాలెంట్‌తో అవ‌కాశం వ‌స్తుంద‌ని ఎదురు చూడ‌గా, ఇప్పటికి కూడా అదే నమ్మకంతో ఉన్నాను. కాస్టింగ్ కౌచ్ లాంటి వాటిని నేను పెద్దగా పట్టించుకోనంటూ కిర్రాక్ సీత కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. బేబి సినిమాతో కిర్రాక్ సీత‌కి మంచి పేరు వ‌చ్చింది. బేబి సినిమాలో మేయిన్‌ లీడ్స్‌ తర్వాత ఎక్కువగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ పాత్ర సీతది. వైష్ణవి ఫ్రెండ్‌గా కాస్త నెగెటీవ్‌ షెడ్స్‌ ఉన్న పాత్రలో న‌టించిన ఈమె కనిపించింది కాసేపే అయినా ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

 

అయితే సీత పాత్ర తాలుకూ ఇంపాక్ట్ జ‌నాల్లో బాగా ఉండ‌డంతో ఆమె ఎక్కడ కనిపించినా ప్రేక్షకులు తిట్టి పోస్తున్నారు. బేబీ సినిమా తర్వాత తనకు వేధింపులు పెరిగాయని, కొందరు రేప్‌ చేసి.. చంపేస్తామని బెదిరించారని కిర్రాక్ సీత ఇటీవ‌ల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఒక రోజు తను ఈవెంట్‌ నుంచి వస్తుంటే కొంత మంది అబ్బాయిలు నా వెంటపడి బెదిరించారని, దాంతో వాళ్ల గురించి పోలిసులకు చెప్పమని తన ఫ్రెండ్స్‌ అన్నారని వివ‌రించింది. వారు రీల్ లైఫ్ క్యారెక్ట‌ర్ చూసి అలా అంటున్నార‌ని , వారి గురించి పోలీసుల‌కి చెప్ప‌న‌ని సీత పేర్కొంది. ఇక సీత గ‌తంలో ప‌లు షార్ట్ ఫిలింస్‌లో న‌టించి మెప్పించింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...