Home Film News నెల్లూర్ చేరిన సోనూ సూద్ ఆక్సిజన్ ప్లాంట్.. పండగ చేసిన ఫాన్స్!
Film News

నెల్లూర్ చేరిన సోనూ సూద్ ఆక్సిజన్ ప్లాంట్.. పండగ చేసిన ఫాన్స్!

Sonu Sood Sends Oxyzen Plant To Nellore

సోనూ సూద్ మంచి నటుడిగా మాత్రమే కాదు.. ఒక స్వార్థం లేని గొప్ప మానవతా వాదిగా కూడా తనని తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. సినిమాల ద్వారా తను సంపాదించిన డబ్బుని.. గొప్ప గొప్ప పనులు చేయడానికి ఉపయోగిస్తున్నాడు. ఇప్పటిదాకా ఇలా చేసిన పనులు చాలానే ఉన్నాయి. ఒక పేదింటికి ట్రాక్టర్ పంపించడం, ఎవరికైనా చదువుకోడానికి డబ్బులు లేకపోతే వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం, ఉన్నపళంగా బయటికి వచ్చి ఒక సామాన్యుడిలా కనిపించడం వంటివన్నీ చేస్తున్నాడు. ఇలాంటి పనులన్నీ.. అతన్ని మీడియా చేత ‘రియల్ హీరో’ అనిపిస్తున్నాయి.

ఐతే, సోనూ సూద్ ఈ మధ్య చేసిన మరో గొప్ప పని ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. అదే.. మన నెల్లూర్ కి ఆయన ఒక ఆక్సిజన్ ప్లాంట్ ని పంపించాడన్నమాట. దాన్ని అక్కడి వాళ్ళు రిసీవ్ చేసుకుని.. బాణాసంచా కాల్చి.. సోనూ సూద్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకున్నారు. సోనూ సూద్ పట్ల వాళ్ళకి ఎంత అభిమానం ఉందో ఇట్టే తెలిసిపోతుంది. ఎక్కడ ఎవరు కష్టాల్లో ఉన్నా.. తన శక్తి మేర అందరికీ ఇలా సహాయపడుతూ.. సోనూ సూద్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...