Home Film News Venu Swamy: పెళ్లే కాలేదు.. అప్పుడే ర‌కుల్ ప్రీత్ సింగ్‌కి విడాకులు అంటూ వేణు స్వామి షాకింగ్ కామెంట్స్
Film News

Venu Swamy: పెళ్లే కాలేదు.. అప్పుడే ర‌కుల్ ప్రీత్ సింగ్‌కి విడాకులు అంటూ వేణు స్వామి షాకింగ్ కామెంట్స్

Venu Swamy: ఒక‌ప్పుడు టాలీవుడ్‌ని త‌న న‌ట‌న‌తో పాటు అంద‌చందాల‌తో ఓ ఊపు ఊపేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తెలుగులో సినిమాలు చేయ‌డం లేదు. చేయ‌డం లేదు అన‌డం క‌న్నా అవ‌కాశాలు రావ‌డం లేదు అని చెప్పాలి. ప్ర‌స్తుతం బాలీవుడ్‌కే ప‌రిమిత‌మైన ఈ భామ పెద్ద‌గా స‌క్సెస్‌లు అందుకోలేక‌పోతుంది. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలో అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది. ఇక త‌న బాయ్ ఫ్రెండ్‌తో ప‌బ్లిక్‌గా తిరుగుతూ ఆమె చేసే సంద‌డి పీక్స్ లో ఉంద‌ని చెప్పాలి.మూడు పదుల వయుసు క్రాస్ చేసిన‌ ఈ హాట్ బ్యూటీ, కొంత కాలంగా జాకీ అనే న‌టుడితో ప్రేమాయణం కొనసాగిస్తోంది.

కొద్ది రోజుల క్రితం త‌మ ప్రేమ విష‌యాన్ని అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టించిన ర‌కుల్ త‌న పెళ్లి విష‌యంపై ఇప్ప‌టి వ‌రకు నోరు విప్ప‌డం లేదు. అయితే ర‌కుల్ పెళ్లి చేసుకుంటే ఆమె జీవితం ఇంత‌క‌ముందులా ఉండ‌ద‌ని, అన్ని క‌ష్టాలే ఉంటాయ‌ని వేణు స్వామి ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. ఆమె  ప్రేమలో పడ్డప్పట్నుండి కెరియర్ ఏమాత్రం ఆశాజనకంగా లేదని,ఇండస్ట్రీలో ఎక్కువగా అవకాశాలు కూడా ర‌కుల్‌కి రావడం లేదు. ఇక  పెళ్లి చేసుకుంటే మాత్రం సమంత లాగా ఈమె కూడా త‌న భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉండాల్సిందేనని జోస్యం చెప్పారు. మ‌రి వేణు స్వామి మాట‌లు విని ర‌కుల్ పెళ్లి చేసుకోకుండా అలా ఉంటుందా , లేదంటే పెళ్లి చేసుకొని తాను ఎంత సంతోషంగా ఉంద‌నేది వేణు స్వామికి చూపిస్తుందా చూడాలి.

నార్త్ బ్యూటీ అయిన ర‌కుల్ కన్నడ సినిమాతో  ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ‘కెరటం’ మూవీతో తెలుగు ఆడియెన్స్ కు హీరోయిన్ గా ప‌రిచ‌యం అయిన ర‌కుల్‌…’తడయార తాక్క’ మూవీతో తమిళం ప్రేక్షకులని ప‌ల‌క‌రించింది. కెరీర్ మొద‌ట్లో  పెద్దగా సక్సెస్ లు రాకపోయినా, ఆ తర్వాత మాత్రం వరుస విజయాలు అందుకొని టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ప్రస్తుతం హిందీతో పాటు సౌత్ సినిమాలో అడ‌పాద‌డ‌పా అవ‌కాశాలు అందుకుంటుంది.  లోకనాయకుడు కమల్ హాసన్ తో కలిసి ‘ఇండియన్ 2’ అనే సినిమా చేస్తుండ‌గా, ఈ మూవీ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతుంది. ఈ మూవీపై ర‌కుల్ భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...