Home Film News Srireddy: కూతురు వ‌య‌స్సు ఉన్న న‌టితో కామ వేషాలేంటి.. చిరంజీవిని ఉతికి ఆరేసిన శ్రీరెడ్డి
Film News

Srireddy: కూతురు వ‌య‌స్సు ఉన్న న‌టితో కామ వేషాలేంటి.. చిరంజీవిని ఉతికి ఆరేసిన శ్రీరెడ్డి

Srireddy: క్యాస్టింగ్ కౌచ్‌తో ఒక్క‌సారిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన వివాదాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి. వైసీపీ మ‌ద్ద‌తుదారురాలిగా ఉంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు ఆయ‌న ఫ్యామిలీని ఎప్పుడు ఏదో ర‌కంగా విమ‌ర్శిస్తూనే ఉంటుంది. గ‌తంలో చిరంజీవి త‌ల్లిపై త‌ప్పుడు కామెంట్స్ చేసి క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. తాజాగా చిరంజీవి గురించి దారుణ‌మైన కామెంట్స్ చేసింది. వివ‌రాల‌లోకి వెళితే..
చిరంజీవి హీరోగా నటించిన `భోళాశంకర్‌` చిత్రం ఆగ‌స్ట్ 11న విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడు ఆదివారం శిల్పకళా వేదికలో జరిగింది. ఈ వేడుకకి సినిమాకి సంబంధించిన ప్ర‌ముఖ న‌టీన‌టులు హాజ‌ర‌య్యారు. అలానే కొంద‌రు ద‌ర్శ‌కులు కూడా హాజ‌రై వేడుక‌లో సంద‌డి చేశారు.

చిత్రంలో కీర్తిసురేష్‌.. చిరంజీవికి చెల్లెలుగా న‌టిస్తుండ‌గా, ఆమె గురించి స‌ర‌దాగా కొన్ని వ్యాఖ్య‌లు చేశారు చిరు. సినిమాలో చేసిన చెల్లి పాత్రని ఈ మూవీతో మ‌ర‌చిపోవాల‌ని, మున్ముందు తనతో హీరోయిన్‌గానూ చేస్తానంటూ కొన్ని కామెంట్స్ చేశారు మెగాస్టార్. అంతేకాదు త‌న ఇంటి ఫుడ్ తిని కీర్తి చాలా గ్లామ‌ర్‌గా మారిందంటూ కాస్త చిలిపిగా వ్యవహరించారు చిరు. ఆయన వ్య‌వహారం అంద‌రికి స‌ర‌దా అనిపించింది. కాని శ్రీరెడ్డికి మాత్రం ఆగ్ర‌హం తెప్పించింది. మెగా ఫ్యామిలీపై ఎప్పుడెప్పుడు నోరు పారేసుకుందామా అని చూసే శ్రీరెడ్డికి చిరంజీవి వ్యాఖ్య‌లు మంచి అవ‌కాశం ఇచ్చాయి.

 

త‌న సోష‌ల్ మీడియాలో.. సినిమాలో చెల్లెలు పాత్ర, నిజ జీవితంలో తన కూతురు వయసున్న కీర్తి సురేష్‌తో లక్షల మంది ప్రజల ముందు ఆ చిలిపి పనులు, కామ వేషాలు ఏంటి చిరంజీవిగారు అని స్మూత్‌గా కౌంట‌ర్ ఇచ్చింది. కనీసం గద్దర్‌ గారికి మౌనం పాటించి ఉంటే మీ గౌరవం మరింత పెరిగి ఉండేది అని ఆమె పేర్కొంది. అయితే శ్రీరెడ్డి మాట‌ల‌కి మెగా ఫ్యాన్స్ గ‌ట్టి కౌంట‌ర్ ఇస్తున్నారు. ఆమెని పచ్చి బూతుల‌తో తిట్టిపోస్తున్నారు. అస‌లు నీకు ఇంకా పచ్చ కామర్లు తగ్గలేదు. ప‌త్తిత్తు మాట‌లు బాగానే మాట్లాడ‌తావులే అంటూ ఘాటు కౌంటర్స్ ఇస్తున్నారు. కాగా శ్రీరెడ్డి.. నాలుగేళ్ల క్రితం.. ఇండస్ట్రీలో చాలా మంది త‌న‌ను మోసం చేశారని కొందరు పేర్లు కూడా బయటపెట్టింది శ్రీరెడ్డి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...