Home Film News Dil Movie: దిల్ సినిమాలో న‌టించిన ఆ ఐదుగురు చ‌నిపోయార‌న్న విష‌యం తెలుసా?
Film News

Dil Movie: దిల్ సినిమాలో న‌టించిన ఆ ఐదుగురు చ‌నిపోయార‌న్న విష‌యం తెలుసా?

Dil Movie: నితిన్, నేహా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వివి వినాయ‌క్ తెర‌కెక్కించిన సూప‌ర్ హిట్ చిత్రం దిల్‌. శ్రీవెంక‌టేశ్వర బేన‌ర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించ‌గా, ఈ సినిమా పేరునే త‌న ఇంటి పేరుగా మార్చుకున్నారు దిల్ రాజు. ఈ సినిమా అప్ప‌ట్లో యువ‌త‌కి బాగా న‌చ్చేసింది. ఈ సినిమాలో నితిన్ త‌న యాక్టింగ్, డ్యాన్స్, లవ్ తో ప్రేక్షకులను ఎంతో ఫిదా చేసి తెలుగు ప్రేక్ష‌కులకి ద‌గ్గ‌ర‌య్యాడు. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కే కాకుండా హీరోకి కూడా ఈ సినిమా చాలా స్పెష‌ల్ అని చెప్పాలి. ఇప్ప‌టికీ ఈ సినిమా టీవీలో వ‌చ్చిందంటే ప్రేక్ష‌కులు బాగా ఆద‌రిస్తారు. అయితే దిల్ సినిమాలో నితిన్ తో నటించిన ఐదుగురు న‌టులు ఈ లోకాన్ని విడిచిపోయారు. వారు ఎవరోచూద్దాం.

ముందుగా చ‌ల‌ప‌తి రావు. ఈ సీనియ‌ర్ న‌టుడు చిత్రంలో నితిన్‌కి తండ్రిగా న‌టించి మెప్పించారు. ఆయ‌న ఊహించ‌ని విధంగా గుండెపోటుతో క‌న్నుమూసారు. చ‌ల‌ప‌తిరావు మ‌ర‌ణం ఒక్క‌సారిగా అంద‌రిని శోక‌సంద్రంలో ముంచెత్తింది. అంత మంచి న‌టుడు లోకాన్ని విడిచిపోవ‌డం ఎవరు జీర్ణించుకోలేక‌పోయారు. మ‌రో న‌టుడు ఎమ్మెస్ నారాయణ. ఈయ‌న కామెడీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఎక్కువ‌గా తాగుబోతు పాత్ర‌ల‌లో కనిపించే ఎమ్మెస్..దిల్ చిత్రంలో లెక్చరర్ పాత్రలో నటించి నవ్వులు పూయించారు. ఎమ్మెస్ నారాయణ అనారోగ్యంతో క‌న్నుమూసిన విష‌య తెలిసిందే. ఆమె మ‌ర‌ణంతో కామెడీ లోకం క‌న్నీరు పెట్టుకుంది.

 

ఇక దిల్ చిత్రంలో న‌టించిన మరో క‌మెడీయ‌న్ వేణు మాధ‌వ్. ఇత‌ను నితిన్ కు మామగా నటించి తెగ సంద‌డి చేశారు. ఎంతో మంచిగా ఉండే వేణుమాధవ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో క‌న్నుమూసారు. ఆయ‌న మ‌ర‌ణం కూడా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కి తీర‌నిలోటుగా మారింది. ఇక దిల్ చిత్రంలో హీరోయిన్ కు తాత పాత్రలో నటించినటువంటి రాజన్ పి దేవ్ గారు కూడా అనారోగ్యంతో కాలం చేశారు. అలానే ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించినటువంటి ఆహుతి ప్రసాద్ చిన్న వ‌య‌స్సులోనే క‌న్నుమూసి అందరికి శోకాన్ని మిగిల్చారు. ఇలా చిత్రంలో న‌టించిన ఐదుగురు న‌టులు మ‌న మధ్య‌లో లేక‌పోవ‌డం అభిమానుల‌ని ఎంతో క‌లిచివేస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...