Home Film News Niharika: నిహారిక విడాకులు క‌న్‌ఫాం చేసిన వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్..!
Film News

Niharika: నిహారిక విడాకులు క‌న్‌ఫాం చేసిన వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్..!

Niharika: మెగా ఫ్యామిలీలో ఇటీవ‌ల ఎక్కువ‌గా విడాకుల వార్త‌లు వింటున్నాం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టికే రెండు సార్లు విడాకులు తీసుకొని ముచ్చ‌ట‌గా మూడోసారి విదేశీ భామ అన్నా లెజీనావోని వివాహం చేసుకున్నాడు. ఇప్ప‌టికీ ఆయ‌న పెళ్లిళ్ల‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తూనే ఉంటుంది. ఇక చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకోగా అవి రెండు కూడా పెటాకులు అయిన‌ట్టు తెలుస్తుంది. మొద‌టి భ‌ర్త‌ని ప్రేమించి వివాహం చేసుకొని అత‌నికి విడాకుల‌కి ఇచ్చి రెండో పెళ్లి కుటుంబ స‌భ్యులు చూపించిన వారిని చేసుకుంది. అత‌డితో కూడా శ్రీజ‌కి విడాకులు జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది.

ఇక మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల త‌నయ నిహారిక పెళ్లి రాజ‌స్థాన్ ప్యాలెస్ లో చాలా అట్ట‌హాసంగా జ‌రిగింది.  అప్పట్లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగి వార్త‌ల‌లోకి ఎక్కింది. అయితే వీరి  పెళ్లై మూడేళ్లు గ‌డవకముందే నిహారిక, చైతన్య మ‌ధ్య మనస్పర్ధలు త‌లెత్తి అవి విడాకుల వరకు దారి తీశాయ‌ని కొన్నాళ్లుగా వార్త‌లు  వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇంతవరకు మెగా ఫ్యామిలీ కాని, నిహారిక గాని స్పందించింది లేదు. అంతేకాదు  నిహారిక చైతన్య జంటగా కనిపించి చాలా కాలం అయిపోయింది. పైగా సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒకరినొకరు అన్ ఫాలో అవ్వడం, ఇన్‌స్టాగ్రామ్ లో ఇద్ద‌రూ త‌మ‌ పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడం తో వీరిద్ద‌రు విడాకులు తీసుకున్న‌ట్టు అంద‌రు అనుకుంటున్నారు.

ఇక‌పోతే వ‌రుణ్‌-లావ‌ణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ తో మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల‌ విడాకుల‌పై ఫుల్ క్లారిటీ వ‌చ్చేసిందని నెటిజ‌న్స్ అంటున్నారు.  లాస్ట్ నైట్ జ‌రిగిన వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ వేడుక‌లో కూడా నిహారిక ఒంట‌రిగానే క‌నిపించింది తప్ప ఆమెతో త‌న భ‌ర్త లేడు. ఈ క్ర‌మంలో నిహారిక‌, చైత‌న్య విడాకులు దాదాపు క‌న్ఫార్మ్ అయిపోయాయ‌ని నెట్టింట చ‌ర్చించుకుంటున్నారు.మరోవైపు నాగబాబు-నిహారిక దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతుంది. భర్త వెంకట చైతన్యతో నిహారిక విడిపోయినప్ప‌టి నుండి తండ్రీ కూతుళ్ళ మధ్య మనస్పర్థలు తలెత్తాయనే వాదన వినిపిస్తోంది. ఇక వరుణ్ ఎంగేజ్మెంట్ కి కూడా వెంకట చైతన్య హాజరు కాక‌పోవ‌డంతో  నిహారికతో ఆయన విడాకులు లాంఛనమే అంటున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...