Home Film News Varun Tej Lavanya: వరుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠి ప్రేమ ఎప్పుడు మొద‌లైంది.. ఇన్నాళ్లు ఎందుకంత సీక్రెట్‌గా ఉంచారు..!
Film News

Varun Tej Lavanya: వరుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠి ప్రేమ ఎప్పుడు మొద‌లైంది.. ఇన్నాళ్లు ఎందుకంత సీక్రెట్‌గా ఉంచారు..!

Varun Tej Lavanya: మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, అందాల రాక్ష‌సి లావ‌ణ్య త్రిపాఠి జూన్ 9న రాత్రి ఎనిమిది గంట‌ల‌కు నిశ్చితార్థంతో ఒక్క‌ట‌య్యారు. ఇన్నాళ్లు వీరి ప్రేమ‌, పెళ్లికి సంబంధించి అంద‌రిలో అనేక అనుమానాలు నెల‌కొన‌గా, ఈ వేడుక‌తో వాట‌న్నింటికి పులిస్టాప్ ప‌డింది.చాలా అట్ట‌హాసంగా జ‌రిగిన నిశ్చితార్థం వేడుక‌కి మెగా, అల్లు కుటుంబ స‌భ్యులు అంద‌రు హాజ‌ర‌య్యారు. అయితే అస‌లు వీరి ప్రేమ ఎప్పుడు మొద‌లైంది, ఇన్నాళ్లు ఇంత సీక్రెట్‌గా ఎలా ఉంచారు అనేది అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. లావణ్య-వరుణ్ జంటగా మిస్టర్ మూవీ  అనే చిత్రాన్ని  దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించారు.  2017లో విడుదలైన ఈ మూవీ దారుణ‌మైన ఫ్లాప్ చ‌వి చూసిన‌ప్ప‌టికీ ఈ చిత్రం మాత్రం వ‌రుణ్ తేజ్‌-లావ‌ణ్య‌ల‌ని క‌లిపింది.

మిస్ట‌ర్ మూవీ సెట్స్ లో వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠిల మ‌ధ్య ఏర్ప‌డిన స్నేహం మెల్లమెల్ల‌గా ప్రేమ‌గా మారింది.  మిస్ట‌ర్ సినిమా త‌ర్వాత నుండి ఈ ఇద్ద‌రు తరచుగా కలుసుకోవడం మొదలుపెట్టారట.అలా  ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు ఒకటే కావడంతో ఒకరిపై మరొకరికి చాలా  ఇష్టం ఏర్పడింది. అలా 2018లో వ‌చ్చిన అంత‌రిక్షం చిత్రంలో మ‌రోసారి క‌లిసి న‌టించారు. అప్పుడు ఇద్ద‌రు మ‌రింత ద‌గ్గ‌ర కావ‌డం, వ‌రుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠికి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటాన‌ని అన‌డం, దానికి లావ‌ణ్య త్రిపాఠి ఎస్ చెప్ప‌డం జ‌రిగిపోయింద‌ట‌. ఇక అప్పటి నుండి వీరిద్ద‌రి మ‌ధ్య చాలా సీక్రెట్‌గా రిలేష‌న్ న‌డుస్తూ వ‌చ్చింది.

2020లో నిహారిక వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో జర‌గ‌గా, ఆ వేడుకకి మెగా కుటుంబ సభ్యులకు మాత్రమే ఆహ్వానం అందింది. పరిశ్రమ నుండి మాత్రం లావణ్య త్రిపాఠి, రీతూ వర్మ మాత్రమే హాజరయ్యారు. అప్పట్లో ఇది హాట్ టాపిక్ అవ్వ‌డం లావణ్య త్రిపాఠి, వ‌రుణ్ తేజ్ ల‌మ‌ధ్య స‌మ్ థింగ్ స‌మ్‌థింగ్ న‌డుస్తుంద‌నే ప్ర‌చారాలు జ‌ర‌గ‌డం మ‌నం చూశాం.  అయితే
ఈ వార్త‌ల‌ని లావ‌ణ్య ఖండిస్తూ వ‌చ్చింది. ఒక ప్రక్క పీకల్లోతు ప్రేమలో ఉండి కూడా మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని అబద్దం చెప్పంది లావ‌ణ్య‌. అయితూ ఆమె అలా చెప్పిన‌ప్ప‌టికీ ఎక్కోడో ఓ మూల వీరిద్ద‌రి వ్య‌వ‌హారంకి సంబంధించి అనేక అనుమానాలు అంద‌రిలో ఉన్నాయి. వీట‌న్నింటికి ఈ ఎంగేజ్మెంట్ తెరదించింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...