Home Film News Superstar Krishna: రాజీవ్ గాంధీ చనిపోకపోతే.. సూపర్ స్టార్ కృష్ణ సీఎం అయ్యేవారేనా..?
Film News

Superstar Krishna: రాజీవ్ గాంధీ చనిపోకపోతే.. సూపర్ స్టార్ కృష్ణ సీఎం అయ్యేవారేనా..?

Superstar Krishna: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ హిస్టరీలో ఎన్నో మరపురాని సంఘటనలు ఉన్నాయి. అవి ఎప్పటికీ గుర్తుం ఉంటాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి, రాజకీయాలకు విడదీయలేని రిలేషన్ ఉండేది. ఎంజీఆర్, ఎన్టీఆర్ లతో పాటు బాలయ్య, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు రాజకీయాల్లో తమదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ తన క్రేజ్ తో టీడీపీని స్థాపించి తెలుగు రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఇక సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చి అధికారాన్ని దక్కించుకున్న నాదెండ్ల భాస్కర్ రావుకు అనుకూలంగా ఓ పెద్ద పేజీలో ప్రకటన రిలీజ్ చేశారు. ఆ టైమ్ లో రాజకీయాల్లో కృష్ణ పేరు ఓ రేంజ్ లో మార్మోగింది. రాజీవ్ గాంధీతో సూపర్ స్టార్ కు ఉన్న రిలేషన్ ఏంటి.. ఏలూరు ఎంపీతో అంత మెజార్టీతో ఎలా గెలిచారు.. ఒకవేళ రాజీవ్ గాంధీ ఉంటే కృష్ణ సీఎం అయ్యేవారా అనే ఆసక్తికరమైన విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ సినిమాను ప్రేమించే వ్యక్తిగానే తెలుసు. కానీ ఆయనలో రాజకీయనాయకుడు కూడా ఉన్నాడు. ఇందిరా గాంధీ చనిపోయినప్పుడు ఆమె అంత్యక్రియలకు హాజరయ్యారు.

 

అప్పట్నుండే రాజీవ్ గాంధీతో కృష్ణకు మంచి అనుబంధం ఏర్పడింది. అప్పట్నుండి వీరు స్నేహితులుగా మారారు. అప్పట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి కూడా బాలేదు. ఎన్టీఆర్ రాజకీయంతో ఓ కొత్త ఒరవడి వచ్చింది. దీంతో ఎన్టీఆర్ కు ధీటుగా ఉండేవారి కోసం కాంగ్రెస్ చాలా ప్రయత్నించింది. ఎన్టీఆర్ నుండి అధికారాన్ని లాక్కున్న నాదెండ్ల భాస్కర్ రావుకు అనుకూలంగా ఓ ప్రకటన వేశారు. అప్పట్లో ఆ వార్త సంచలనంగా మారింది. కాంగ్రెస్ ఇక వెంటనే కృష్ణను ఎంచుకుంది. ఇక రాజీవ్ గాంధీపై ఉన్న అభిమానంతో మాటను కాదనలేకపోయాడు. అలా 1984 లో పార్టీలో చేరారు. ఆయన పార్టీలో చేరినప్పటి నుండి రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. 1989 లో పిలిచి మరీ ఎంపీ టికెట్ ఇచ్చారు.

దాంతో కృష్ణ ఏలూరు లోక్ సభ నుండి 71 వేల మెజారిటీతో గెలిచారు. దాంతో ఒక్కసారిగా ఢిల్లీ వరకు కృష్ణ పేరు మార్మోగింది. దీంతో కాంగ్రెస్ తరఫున సీఎంగా కృష్ణను బరిలోకి దించుతారని ప్రచారం సాగింది. కానీ అప్పుడే రాజీవ్ గాంధీ చనిపోయారు. దాంతో ఒక్కసారిగా కృష్ణ కూడా రాజకీయంగా డీలా పడిపోయారు. అప్పట్నుండి కృష్ణ రాజకీయాలకు దూరం అయ్యారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీలోకి పిలిచినప్పుడు కూడా తిరస్కరించారు. అందుకే ఒకవేళ రాజీవ్ గాంధీ బ్రతికి ఉంటే ఖచ్చతంగా సూపర్ స్టార్ కృష్ణ ముఖ్యమంత్రి అయ్యేవారని ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు, సినీ ప్రముఖులు అన్నారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...