Home Film News Adipurush: నెలసరి ఉన్న‌వారు ఆదిపురుష్ చూడొచ్చా.. థియేట‌ర్‌లో ఉచితంగా ప్ర‌సాదం పంపిణీ చేస్తారా..!
Film News

Adipurush: నెలసరి ఉన్న‌వారు ఆదిపురుష్ చూడొచ్చా.. థియేట‌ర్‌లో ఉచితంగా ప్ర‌సాదం పంపిణీ చేస్తారా..!

Adipurush: మ‌రో రెండు రోజుల‌లో విడుద‌ల కానున్న ఆదిపురుష్‌పై అంద‌రిలో భారీ అంచ‌నాలు ఉన్నాయి.బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు నిరాశ‌ప‌ర‌చ‌డంతో ఇప్పుడు ఆదిపురుష్‌పై ఫ్యాన్స్ అంచ‌నాలు ఓ రేంజ్‌లో పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు కూడా చేప‌డుతున్నారు. అయితే ఒక‌వైపు మేక‌ర్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా, మ‌రి కొంద‌రు మాత్రం చిత్రంపై దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇటీవ‌ల నిర్మాత‌లు ఒక ప్ర‌క‌ట‌న‌లో.. రాముడు ఉన్న చోట హనుమంతుడు ఉంటాడని.. కాబట్టి రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ థియేటర్స్‌కి హనుమంతుడు వస్తాడనే నమ్మకంతో ఒక సీటు ఖాళీగా వదిలేస్తున్నట్టు ప్ర‌క‌టించారు.

హ‌నుమంతుడి కోసం సీటు నిర్ణయంపై కొంద‌రు పెద‌వి విరుస్తున్నారు.   ప్రముఖ హేతువాది, బిగ్ బాస్ ఫేం బాబు గోగినేని అయితే ‘ఆదిపురుష్’ చిత్ర యూనిట్‌పై సెటైర్లు వేస్తూ ఫేస్ బుక్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు. సినిమా హాల్ ను గుడిగా మార్చడానికి పర్మిషన్ ఉందా? అక్కడ భక్తులకు కొబ్బరికాయలు కొట్టే సదుపాయం ఏర్పాటు చేశారా? ప్రదర్శనశాల గుడిగా మారితే, భక్తులు పూజలు చేసుకోవాలంటే కంచు గంటలూ, భక్తులు ఆశీర్వాదం పొందడానికి ఒక దేశీ ఆవూ, సరైన కులం నుండి ఒక పూజారీ, హల్ లో నిత్యాన్నదానం కోసం హుండీలూ ఉండాలి కదా?  పరమతస్తులు సినిమా చూడాలంటే టిక్కెట్ కొనే ముందు రిజిస్టర్ లో సంతకం పెట్టాలి కదా? రిజిస్టర్ లు పెట్టారా?

అలాగే, థియేటర్ లో అప్రాచ్యపు యురోపియన్ల చిప్స్, మెక్సికన్ల పాప్కార్న్, అమెరికన్ల బర్గర్లు, కోకులు అమ్మవచ్చా? అమ్మే వాళ్ళ మతాలు, కులాలు తెలుసుకున్నారా?  నిజానికి నిర్మాతలు ప్రసాదం ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లు చేయాలి కదా? చేస్తున్నారా? బహిష్టులో ఉన్న ఆడవారు బ్రహ్మచారులు ఉన్న సినిమా హాల్ లోకి, లేక సినిమా ప్రదర్శిస్తున్న గుడులలోకి ప్రవేశించవచ్చునా?  ఏది ఏమైనా, నియమం ప్రకారం మగవాళ్ళు చొక్కా లేకుండా, ఎవరు కూడా లోనికి తోలు వస్తువులు తీసుకురాకుండా, తోలు బెల్టులు లాంటివి ధరించకుండా, చెప్పులు లేకుండా లోనికి వెళ్ళాలి కదా? రాహు కాలం లో షో ఉంటే ఏమి చేయాలి? హాలు వాస్తు ప్రకారం లేకపోతే రెమెడీ ఎవరు ఇవ్వాలి? తూర్పు కు దండం పెట్టుకోవాలంటే, లేదూ సేతువు ఎటు వైపు ఉందో చూపించే దిక్సూచి ప్రతి హాల్ లో ఉంటుందా?  శుభం  అంటూ చిత్ర యూనిట్‌పై సెటైర్లు వేస్తూ ఫేస్ బుక్‌లో ఒక‌ పోస్ట్ పెట్టారు బాబు గోగినేని. దీనికి కొంద‌రు స‌పోర్ట్ ఇస్తుండ‌గా, మ‌రి కొంద‌రు వ్య‌తిరేఖిస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...