Home Film News Heroine: సినిమా ఛాన్స్‌లు లేక ప‌బ్‌లో అలాంటి ప‌ని చేస్తున్న ప‌వ‌న్ హీరోయిన్
Film News

Heroine: సినిమా ఛాన్స్‌లు లేక ప‌బ్‌లో అలాంటి ప‌ని చేస్తున్న ప‌వ‌న్ హీరోయిన్

Heroine: ఎక్క‌డైన కొత్త నీరు వ‌స్తే పాత నీరు పోవ‌ల్సిందే.  మార్కెట్లోకి కొత్త కొత్త వస్తువులు వచ్చినా కొద్దీ పాత వస్తువుల డిమాండ్ తగ్గిపోయినట్లు సినిమా ప‌రిశ్ర‌మ‌లో కూడా కొత్త కొత్త హీరోయిన్స్ వ‌స్తున్న‌ప్పుడు పాత హీరోయిన్స్‌కి అవ‌కాశం త‌గ్గిపోతూ ఉంటుంది. అందుకే చాలా మంది అందాల ముద్దుగుమ్మ‌లు దీపం ఉన్న‌ప్పుడే ఇల్లు స‌క్క‌బెట్టుకుంటారు. క్రేజ్ ఉన్న‌ప్పుడు ఫుల్ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తుంటారు.  ఆ డ‌బ్బులో ఏదైన వ్యాపారాలు చేస్తూ ఫ్యూచ‌ర్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిన్ ఇప్పుడు అవ‌కావాలు లేక ప‌బ్ లో అలాంటి ప‌ని చేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఆమెని చూసి అంద‌రు షాక్ అవుతున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు విష్ణువర్ధన్ తెరకెక్కించిన చిత్రం ‘పంజా’ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా న‌టించింది అంజలి లవానియా. తొలి చిత్రంలోనే అందాల ఆర‌బోత‌తో కుర్రకారు గుండెలలో రైళ్లు ప‌రుగెత్తించింది. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన కొత్త‌లోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో అవ‌కాశం రావ‌డంతో ఈ అమ్మ‌డికి తిరుగు ఉండ‌దు అని అంద‌రు అనుకున్నారు. కాని ఎందుకో కాని పెద్ద‌గా రాణించ‌లేకపోయిన ఈ భామ పంజా త‌ర్వాత మ‌ళ్లీ క‌నిపించ‌లేదు. క్యాస్టింగ్ కౌచ్ సమస్యలను తట్టుకోలేకనే సినీ ఇండస్ట్రీని వదిలిపెట్టినట్లు ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చింది.

‘పంజా’ సినిమా తర్వాత పూర్తిగా మోడలింగ్‌ కెరీర్‌పై ప్ర‌త్యేక‌ దృష్టి పెట్టిన ఈ అమ్మడు.. 2012‌లో ‘వాగ్’ టాప్ 10 ఫిమేల్ మోడల్స్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. ఇక అనంతరం మోడలింగ్ రంగానికి కూడా గుడ్ బై చెప్పేసి.. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఇక  చక్ర హీలింగ్’లో కొన్ని హీలింగ్స్ ఆర్ట్స్.. అలాగే క్రియా యోగాను నేర్చుకొని ‘చక్ర హీలర్’గా సర్టిఫికెట్ కూడా ద‌క్కించుకుంది. అయితే  అంజ‌లికి సంబంధించి ఇటీవ‌ల నెట్టింట వైర‌ల్ కాగా, ఇందులో .అంజలి లావెనియా పబ్బు లో అందరూ డాన్స్ చేస్తూ ఉంటే మ్యూజిక్ ప్లే చేస్తుంది. ఇది చూసి చాలా మంది అవాక్క‌య్యారు. అవ‌కాశాలు లేక‌నే తాను ఇలాంటి ప‌నులు చేస్తుందేమో అని  భావిస్తున్నారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...