Home Film News వార్‌2 షూటింగ్ అండ్ క్రేజీ అప్డేట్… ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందిగా..!
Film News

వార్‌2 షూటింగ్ అండ్ క్రేజీ అప్డేట్… ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందిగా..!

టాలీవుడ్‌లో హీరోలుగా రాణించినప్పటికీ ప్రతి హీరోకి బాలీవుడ్‌లో కూడా తన సత్తా చూపించాలని ఉంటుంది. అలా ఎంతో మంది హీరోలు బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఎవరూ అక్కడ నిలబడలేకపోయారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో నిర్మిస్తున్న సినిమాలన్నీ పాన్‌ ఇండియా మూవీస్‌గానే రిలీజ్‌ అవుతున్నాయి. ప్రతి సినిమా హిందీలో కూడా రిలీజ్‌ అవుతోంది. హీరోలకు అంతే పాపులారిటీ వస్తోంది. అయితే స్ట్రెయిట్‌ సినిమా చేసి బాలీవుడ్‌లోనూ జెండా పాతాలనేది మన హీరోల ఆలోచన. అందుకే ఎప్పటి నుంచో అలా ప్రయత్నిస్తూనే ఉన్నారు.

Jr NTR to play villain in sequel to Hrithik Roshan's 'War' - The Week

తాజాగా ఎన్టీఆర్‌ కూడా ఓ ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. హృతిక్‌ రోషన్‌ హీరోగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వార్‌2’ చిత్రంలో ఎన్టీఆర్‌ కూడా నటిస్తున్నాడు. దర్శకుడు అయాన్‌ ఇంట్రెస్ట్‌ వల్లే ఎన్టీఆర్‌ ‘వార్‌2’లో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయి చాలా కాలమైంది. ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో హృతిక్‌ రోషన్‌కి సంబంధించిన సీన్స్‌ను చిత్రీకరించారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘దేవర’ షూటింగ్‌లో ఉన్న కారణంగా అతని రాకకోసం ‘వార్‌2’ యూనిట్‌ ఎదురుచూస్తోంది. అందుకే రెండో షెడ్యూల్‌ను వాయిదా వేశారు.

దేవర విడుదల తేదీ వచ్చేసింది.. | The release date of the NTR's upcoming movie Devara, was out - Telugu Oneindia

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌ ఎలా ఉండబోతోంది అనే దానిపై గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తారక్‌ క్యారెక్టర్‌ నెగెటివ్‌ షేడ్స్‌లో ఉంటుందని కొందరు, ఈ సినిమాలో ఎన్టీఆర్‌ విలన్‌గా కనిపిస్తాడని కొందరు చెప్పుకుంటున్నారు. ఇక ఇదే స‌మ‌యంలో నిన్నే ఎన్టీఆర్ దేవ‌ర రీలీజ్ డేట్‌కు సంబందించి కొత్త డెట్‌ను ప్ర‌క‌టించింది. ఇక ఇప్పుడు వార్‌2లో ఎన్టీఆర్‌కు సంభంధిన కొత్త ఆప్‌డ్ట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాజా సమాచారం మేరకు హీరోకు, విలన్‌ మధ్యలో ఉండే థిన్‌ లైన్‌లాంటి క్యారెక్టర్‌ ఎన్టీఆర్‌ చేయబోతున్నారని తెలుస్తోంది. ధూమ్‌ సిరీస్‌లో హృతిక్‌ రోషన్‌, అమీర్‌ ఖాన్‌ అలాంటి క్యారెక్టర్సే చేశారు. ‘వార్‌2’లో ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌ కూడా అలాగే ఉంటుందట. నెగెటివ్‌ షేడ్స్‌తో ఉన్నప్పటికీ ఓటమి ఎరుగని ఓ వీరుడి పాత్ర ఎన్టీఆర్‌ది అని తెలుస్తోంది.

War 2: RRR Star Jr NTR Joins The Action Extravaganza To Lock Horns With Hrithik Roshan?

అదేవిధంగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఈనెల చివరి వారంలో ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది.. ఇప్పటికే హృతిక్‌ రోషన్‌ కూడా మూవీ షూటింగ్లో జాయిన్ అవ్వడానికి రెడీ అయిపోయాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్లో బిజీగా ఉన్నాడు.. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే వార్‌2 షూటింగ్లో ఎన్టీఆర్ జాయిన్ అవుతాడు. అదే విధంగా ఈ సినిమాలో ఫిమేల్ లేడ్‌గా కీరా అద్వానీ నటించబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే 2025 ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Image

అంతేకాదు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్‌ పాయిట్‌ సినిమాలో ఉంటుందని సమాచారం. ఇక ఎన్టీఆర్‌కి ఈ సినిమా తప్పకుండా ఒక స్టెప్‌ లాంటిది అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ కలిసి స్టెప్పులేస్తారట. ఎన్టీఆర్‌ ఎంత గొప్ప డాన్సరో మనకు తెలుసు. అలాగే హృతిక్‌ డాన్స్‌కి కూడా వీరాభిమానులు ఉన్నారు. మరి వీరిద్దరూ కలిసి ఒకేసారి డాన్స్‌ చేస్తూ కనిపిస్తే ఎలా ఉంటుంది? ‘వార్‌2’కి సంబంధించిన ఇలాంటి అప్‌డేట్స్‌ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో, అభిమానుల్లో సినిమాపై క్రేజ్‌ మరింత పెరిగిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...