Home Film News Chandrayaan 3: చంద్ర‌యాన్ 3 స‌క్సెస్ ఆదిపురుష్‌కి లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టిందే..!
Film News

Chandrayaan 3: చంద్ర‌యాన్ 3 స‌క్సెస్ ఆదిపురుష్‌కి లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టిందే..!

Chandrayaan 3: ఇస్రో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన చంద్ర‌యాన్ 3 స‌క్సెస్ కావ‌డంతో ఇప్పుడు ఇండియా ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించింది. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో అడుగుపెట్టిన‌ తొలి దేశంగా భారత్ స‌రికొత్త చరిత్ర సృష్టించింది. ఇక ‘‘చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ నుంచి రోవర్ కూడా  బయటకు వచ్చి చంద్రుడి ఉపరితలంపై త‌న ప‌ని తాను చేసుకుంటుంది. విక్రమ్ ల్యాండర్ లోపల 26 కేజీల ప్రజ్ఞాన్ రోవర్‌ను పెట్టి పంపించ‌గా,  ల్యాండింగ్ సమయంలో ఎగసిన దుమ్మూధూళి సర్దుకున్న తర్వాత విక్రమ్‌ ప్యానెల్స్ తెరుచుకోగా, ఆ స‌మ‌యంలో   ప్రజ్ఞాన్ బయటకు వచ్చేందుకు ర్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఆ ర్యాంప్ గుండా కింద‌కి దిగి అక్క‌డ ఉన్నరాళ్లు, బిలాల పరిసరాల్లో రోవర్ తిరుగుతూ… కీలకమైన డేటాను సేకరించి భూమిపైకి ల్యాండర్, ఆర్బిటర్‌ల ద్వారా కింద‌కి పంపిస్తుంది. అయితే  చంద్ర‌యాన్ స‌క్సెస్‌తో భార‌తీయులు అంద‌రు చాలా సంతోషంగా ఉన్నారు.

చంద్ర‌యాన్ 3 స‌క్సెస్ ఆదిపురుష్ టీంకి లేని పోని చిక్కులు తెచ్చిపెట్టింది.   ఆదిపురుష్ సినిమాపై, డైరెక్టర్ పై   నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదిపురుష్ మ‌రోసారి వార్త‌లలో నిలిచింది. అయితే   చంద్రయాన్ కి ఆదిపురుష్ కి సంబంధం ఏంటా అని మీ అంద‌రికి డౌట్ రావ‌చ్చు. అస‌లు విష‌యం ఏంటంటే.. ప్ర‌భాస్ హీరోగా రూపొందిన  ఆదిపురుష్ సినిమా బడ్జెట్ మొదట 500 కోట్లు అని ప్రకటించి ఆ తర్వాత 600 కోట్లు అయిందని చిత్ర బృంద చెప్పుకొచ్చింది. టీజ‌ర్ రిలీజ్ అయిన‌ప్పుడు దారుణ‌మైన ట్రోల్స్ రావడంతో మ‌రో వంద కోట్లు ఖ‌ర్చు చేసి వీఎఫ్ఎక్స్ చేయించారు. మొత్తంగా  ఆదిపురుష్ సినిమా బడ్జెట్ దాదాపు 700 కోట్లు అయిన‌ట్టు టాక్.

అయితే రీసెంట్‌గా స‌క్సెస్ అయిన  చంద్రయాన్ 3 ప్రాజెక్టుకి ఇస్రో కేవలం 615 కోట్లు ఖ‌ర్చు చేసి ఎవరికి సాధ్యం కాని ఘ‌న‌త సాధించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ గొప్ప విజ‌యం సాధించిన ఇస్రోని కీ్తిస్తూ.. ఆదిపురుష్ టీంతో పాటు డైరెక్ట‌ర్‌ని తెగ తిట్టిపోస్తున్నారు.  615 కోట్లు ఖర్చుపెట్టి ఇస్రో త‌యారు చేసిన ఆదిపురుష్  చంద్రుడి మీదకు వెళ్లి సక్సెస్ అయి దేశం మీసం తిప్పేలా చేసింది. అదే ఆదిపురుష్ రామాయ‌ణం నేప‌థ్యంలో రూపొంది  పరువు తీసింది అని కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...