Home Film News Gandeevadhari Arjuna: వ‌రుణ్ తేజ్ గాండీవ‌ధారి అర్జున మూవీ రివ్యూ.. సినిమా హిట్టా, ఫ‌ట్టా..!
Film News

Gandeevadhari Arjuna: వ‌రుణ్ తేజ్ గాండీవ‌ధారి అర్జున మూవీ రివ్యూ.. సినిమా హిట్టా, ఫ‌ట్టా..!

Gandeevadhari Arjuna: నటీనటులు: వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాసర్, విమలా రామన్, వినయ్ రాయ్, నరైన్, రోషిణి ప్రకాష్, మనీష్ చౌదరి, అభినవ్ గోమటం
రచన & దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
సమర్పణ : బాపినీడు.బి బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
నిర్మాత: BVSN ప్రసాద్
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి (యుకె)
ఆర్ట్ డైరెక్టర్ : శివ కామేష్ డి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
సంగీతం: మిక్కీ జె మేయర్

ఇటీవ‌ల మెగా ఫ్యామిలీ నుండి వ‌చ్చిన సినిమాలు ప్రేక్షకుల‌ని ఎంత‌గానో నిరాశ‌ప‌రిచాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌,సాయిధ‌ర‌మ్ తేజ్ కాంబోలో వ‌చ్చిన బ్రో మిక్స్‌డ్ టాక్ అందుకోగా, చిరంజీవి భోళా శంకర్ చిత్రం దారుణంగా నిరాశ‌ప‌ర‌చింది. దీంతో మెగా ఫ్యాన్స్ డీలా ప‌డ్డారు. ఇలాంటి స‌మ‌యంలో మెగా ఫ్యాన్స్‌లో జోష్ నింపేందుకు వ‌రుణ్ తేజ్ గాండీవధారి అర్జునగా థియేటర్స్ లోకి దిగారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రంలో  సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్ కీలక రోల్స్ చేశారు. నేడు థియేటర్స్ లోకి వ‌చ్చిన గాండీవధారి అర్జునుడు యుద్ధం గెలిచాడా లేదా?  అనేది ఇప్పుడు చూద్దాం.

కథ:
చిత్ర క‌థ విష‌యానికి వ‌స్తే..  కేంద్ర మంత్రి ఆదిత్య రాజ్(నాజర్) ఒక పెద్ద‌ కంపెనీ వలన పర్యావరణం నాశనం అవుతుందని భావిస్తాడు. ఆ కంపెనీ మూసివేయ‌క‌పోతే మానవజాతి మనుగడకే ముప్పు అని గ్ర‌హించి దానిని మూసివేయించే  ప్ర‌య‌త్నాల‌లో ఉంటాడు. అయితే స‌ద‌ర‌కు కార్పొరేట్ సంస్థ త‌మ‌కు ఆదిత్య రాజ్ అడ్డొస్తున్నాడ‌ని భావించి చంపేందుకు సన్నాహాలు చేస్తూ ఉంటుంది. ఆ స‌మ‌యంలో  బాడీగార్డ్ అర్జున్ వర్మ(వరుణ్ సందేశ్) రంగంలోకి దిగుతాడు. ఆదిత్య రాజ్ ప్రాణాలు కాపాడే చార్జ్ తీసుకుంటాడు. ఇక అర్జున్ వర్మ ఎంట్రీ త‌ర్వాత క‌థ‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి,  ఆదిత్య రాజ్ ని చంపాలనుకున్న వారిని అంత‌మొందిస్తాడా? వారికి అర్జున్ వర్మ ఎలా గుణపాఠం చెబుతాడు తెలియాలంటే సినిమా చూడాల్సిందే…

న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్‌:

హిట్‌, ఫ్లాప్ అనే దానితో సంబంధం లేకుండా భిన్నమైన సబ్జెక్టులు ఎంచుకోవడంలో వరుణ్ తేజ్ ఎప్పుడూ ముందుంటారు.  ఈసారి ఆయన యాక్షన్ ఎంటర్టైనర్ వైపు  ఆసక్తి చూపాడు. గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారుతో గాండీవధారి అర్జున మూవీ  చేయ‌గా, ఇందులో వ‌రుణ్ తేజ్ త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌తో ఆక‌ట్టుకున్నాడు.  బాడీగార్డ్ రోల్ లో చ‌క్క‌గా కుదిరాడు. ఆయన యాక్టింగ్, మేనరిజం పాత్ర చాల నేచుర‌ల్‌గా ఉంది. వ‌రుణ్ తేజ్ చాలా స్టైలిష్‌గా క‌నిపించ‌డంతో ఫ్యాన్స్ మురిసిపోయారు.  ఇక చిత్ర క‌థానాయిక‌గా న‌టించిన  సాక్షి వైద్య పూర్తి నిడివి కలిగిన రోల్ దక్కించుకోగా, ఆమె పాత్ర‌కి మంచి మార్కులే ప‌డ్డాయి.  విమలా రామన్, నాజర్, వినయ్ రాయ్ వారి వారి పాత్ర‌ల‌లో నటించి మెప్పించారు.

టెక్నిక‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్:

గరుడవేగ చిత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన  ప్రవీణ్ సత్తారు మంచి సినిమాలు తెర‌కెక్కించ‌గ‌ల‌డు అనే నమ్మకం కలిగేలా చేశాడు.  ఈ సినిమా త‌ర్వా త ప్ర‌వీణ్ చేసిన ఘోస్ట్ దారుణ‌మైన ఫ్లాప్ అయిన‌ప్ప‌టికీ   వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు కథను నమ్మి గాండీవ‌ధారి అర్జున అనే సినిమా చేశాడు. సాధార‌ణంగా  యాక్షన్ థ్రిల్లర్స్ లో సినిమాలు చేసిన‌ప్ప‌డు బలమైన కథ ఉండాల్సిన అవసరం లేదు. అద్భుతమైన స్క్రీన్ ప్లే, విజువల్స్ తో ఆడియన్స్ ఆక‌ట్టుక‌వ‌ల‌సి ఉంటుంది. అది ఈ చిత్రంలో క‌నిపించ‌లేదు. ప‌రుగులు పెట్టే క‌థ‌నం,   ఫ్లాట్ నెరేషన్ అంత ఇంప్రెసివ్‌గా అనిపించ‌లేదు. రొటీన్ ఫార్మాట్‌లో సినిమా వెళుతుంటుంది.

ఇంట‌ర్వెట్ కాస్త సినిమాపై హైప్ తెస్తుంది. సెకండాఫ్ లో సినిమా వేగం పుంజుకోగా, ఇది కొంత ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. కొన్ని చోట్ల మంచి విజువ‌ల్సే ప‌డ్డాయి. ఇక  కెమెరా వర్క్ బాగుంది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అని చెప్పాలి. బీజీఎం అద‌ర‌గొట్టాడు. లండన్ లో తెరకెక్కించిన సన్నివేశాలు చాలా రిచ్ గా అనిపించాయి. ప్రవీణ్ సత్తారు స్టైలిష్ మేకింగ్ బాగానే ఉంది, కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాలు కూడా బాగానే ఉన్నాయి. నిర్మాణ విలువలు, ఎడిటింగ్ ప‌ర్వాలేదు.

ప్లస్ పాయింట్స్:

గ్రాండ్  విజువల్స్
యాక్షన్ సన్నివేశాలు
వరుణ్ తేజ్
బీజీఎం

మైనస్ పాయింట్స్:

స్క్రీన్ ప్లే
ప్ర‌వీణ్ స‌త్తారు డైరెక్షన్
ఫ్లాట్ నెరేషన్

విశ్లేష‌ణ‌:

దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఓ స్టైలిష్ అండ్ రిచ్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేసిన‌ప్ప‌టికీ ఇందులో యాక్షన్ సీక్వెన్స్లు   అంతంత మాత్రమే అన్న‌ట్టు ఉన్నాయి. అవి పెద్దగా థ్రిల్ చేయలేకపోయాయి,  నెరేషన్ చాలా మెల్లగా సాగ‌డం, చాలా చోట్ల లాజిక్ లెస్ సన్నివేశాలతో తెరకెక్కించ‌డంతో యాక్షన్ ఎంటర్టైనర్స్ కి కావాల్సిన రేసీ స్క్రీన్ ప్లే మిస్ అయ్యింది. యాక్ష‌న్ చిత్రాలు ఇష్ట‌ప‌డేవారు ఈ సినిమాని ఒక్క‌సారి చూడ‌వ‌చ్చు. మొత్తంగా చూస్తే ఈ చిత్రం యావ‌రేజ్ అని చెప్పొచ్చు.

రేటింగ్ : 2.5/5

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...